Bigg Boss Divi Photoshoot : భారీ అందాలతో అదరగొట్టేసిన దివి.. ఫోకస్ అంతా అక్కడే.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ వైరల్

Wed, 19 Oct 2022-1:18 pm,

బిగ్ బాస్ షోకు రాకముందు దివి.. చిన్న చిన్న చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉండేది. యాడ్స్‌లో నటిస్తూ వచ్చింది. మహర్షి సినిమాలో ఓ చిన్న పాత్రలో దివి కనిపించేసింది. అయితే బిగ్ బాస్ తరువాత ఆ సీన్స్ వైరల్ అయ్యాయి.

అయితే బిగ్ బాస్ ఇంట్లో దివి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ అని సమంత రావడం, సమంత చేతిలో దివి ఎలిమినేట్ అయిందని చెప్పడంతో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక దివి తన క్రేజ్ చూసుకుని మురిసిపోయింది.

బిగ్ బాస్ షోతో దివి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అందాల ప్రదర్శన, నాభి అందాలకు అందరూ ఫిదా అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో దివి చేసే నాభి అందాల ప్రదర్శనకు జనాలు కిందా మీదా పడిపోయారు.

గాడ్ ఫాదర్ సినిమాలోని ఓ మంచి పాత్రలో దివి నటించింది. అంతే కాకుండా భోళా శంకర్ సినిమాలోనూ దివికి చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా దివికి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

బిగ్ బాస్ దివి ప్రస్తుతం మెగా క్యాంపులో ఉంది. బిగ్ బాస్ స్టేజ్ మీద చిరంజీవి మాటివ్వడం అందరికీ తెలిసిందే. దివిని చూసి తాను కూడా పడిపోయానన్నట్టుగా చిరంజీవి అన్నాడు. తన సినిమాల్లో చాన్స్ ఇస్తానని మాటిచ్చాడు.  

బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన దివి ప్రస్తుతం తన అందాల ప్రదర్శనతోనే జనాలను ఆకట్టుకుంటోంది. తన ఎద అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. ఇక తన కళ్లతోనే మాయ చేసేలా చురకత్తుల్లాంటి చూపుల్తో చేసిన ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link