Bigg Boss Divi: చీరకట్టులో బిగ్ బాస్ దివి మైమరిపించే డ్యాన్స్.. వారెవ్వా ఏం క్రేజ్..!

తాజాగా చీరకట్టుతో యూత్‌ను కట్టిపడేసింది. రెడ్ కలర్ శారీలో మమూరిలా నాట్యం చేస్తూ మతిపొగొట్టేసింది.

తన డ్యాన్స్‌తోనే కాదు.. క్యాప్షన్‌తోనూ ఆకట్టుకుంది. అక్కడ నువ్వు.. ఇక్కడ నేను.. మధ్యలో ఏడు అడుగుల దూరం అంటూ రాసుకొచ్చింది.
ఈ క్యాప్షన్ ఎవరి కోసం అంటూ అభిమానులు అడుగుతున్నారు. దివి కూడా ప్రేమలో పడిందా..? అని కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నారు.
ఇక వీడియోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నువ్వొక అద్భుతం మేడమ్ అంటూ ఆమెను పొగొడేస్తున్నారు.
దివి కెరీర్ విషయానికి వస్తే.. వరుసగా సినిమాలతో ఈ భామ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇటీవల రుద్రంగి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. పుష్ప-2లోనూ కీ రోల్ దక్కినట్లు తెలుస్తోంది.