Nainika: పొట్టి పిల్ల గట్టిగానే కొట్టిందిగా.. ఐదు వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందిందంటే..?

Sun, 06 Oct 2024-10:05 am,

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి.  ఈ బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఒక ఓటిటి వెర్షన్ ను కూడా కంప్లీట్ చేసుకుని,  ఇప్పుడు ఎనిమిదవ సీజన్ మొదలయ్యింది. ఎనిమిదవ సీజన్లో భాగంగా ఐదు వారాలకు గానూ ఆరు మంది ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే వైల్డ్ కార్డు ద్వారా మరో 8 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఐదవ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. 

మొదటి వారంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క,  రెండవ వారం ఆర్జే శేఖర్ బాషా , మూడోవారం ప్రముఖ సెలబ్రిటీ అభయ్ నవీన్,  నాల్గవ వారం రాంగోపాల్ వర్మ బ్యూటీ సోనియా ఆకుల,  ఇక ఐదవ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హీరో ఆదిత్య ఓం, ఇక ఐదవ వారం చివర్లో పొట్టి పిల్ల గట్టిగా ఆడుతూ అందరి ప్రశంసలు అందుకున్న నైనిక ఎలిమినేట్ అయ్యారు. 

తన ఆటతీరుతో.. మాట తీరుతో.. చలాకీతనంతో అందరినీ ఆకట్టుకున్న నైనిక హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల మన్ననలు పొందడానికి  ఎంతో ప్రయత్నం చేసింది . మరి ఈ ఐదు వారాలలో బిగ్ బాస్ నుంచి నైనిక ఎంత రెమ్యూనరేషన్ సొంతం చేసుకుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్ ఒకటవ తేదీన హౌస్ లోకి అడుగుపెట్టిన నైనిక సుమారుగా ఐదు వారాలు ఉంది. ఇక షూటింగ్ కాకుండా ప్రసారమైన ఆదివారాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే 36 రోజులు హౌస్ లో ఉంది.  వారానికి రూ .2లక్షల 20వేల చొప్పున.. అంటే రోజుకు రూ.31, 428 పారితోషకం తీసుకుందని సమాచారం.ఈ లెక్కన బిగ్ బాస్ ద్వారా నైనిక ఐదు వారాలలో సుమారుగా 11 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది.  అదే 36 రోజులకు లెక్కపెడితే రూ.11,31,408 ఈమె సొంతం చేసుకున్నట్లు సమాచారం. 

మొత్తానికైతే 36 రోజులకు గానూ సుమారుగా రూ.11 లక్షల పారితోషకం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా నైనిక హౌస్ లో బాగానే ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 ఈవెంట్ తో  మొత్తం 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link