Black Coffee Health Benefits: బ్లాక్ కాఫీతో బరువు ఎలా తగ్గించుకోవాలి, అద్భుత ప్రయోజనాలివే

Sun, 24 Oct 2021-11:55 am,

గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయానికి సహాజమైన క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, మితిమీరిన లిపిడ్‌లను తొలగించి జీవక్రియ సమర్ధవంతంగా పని చేసేలా చేస్తుంది.

బాడీలో నీరు ఎక్కువైతే కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. బ్లాక్‌కాఫీ బాడీలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్లాక్‌కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కెఫిన్‌ అనే పదార్థం మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. మనిషి శక్తి సామర్ధ్యం మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది.  

అమెరికా వ్యవసాయ విభాగం ప్రకారం..కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా బెల్లం, పంచదార, పాలు, వెనీలా, సోయా మిల్క్, చాకొలెట్ సిరప్ వంటివి జత చేయకుండా తాగితే మంచిది.

బ్లాక్‌కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్లు చాలా శక్తిమంతమైనవి అవి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ప్రాణాలు తీసే కాన్సర్ వ్యాధి రాకుండా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link