Black Coffee Benefits: రోజూ పరగడుపున బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా
అయితే రోజుకు ఎంత కాఫీ తాగాలనేది తెలుసుకోవాలి. అతిగా తీసుకోకూడదు. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రోజుకు 300 ఎంఎల్ కంటే ఎక్కువ తాగకూడదు.
బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఇన్‌ఫ్లమేషన్ , లివర్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా తాగే అలవాటుండేవారిలో కేన్సర్ ముప్పు తగ్గించవచ్చని పలు పరిశోధనల్లో రుజువైంది.
ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే తగ్గుతుందో లివర్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. లివర్ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. ముఖ్యంగా లివర్ సిరోసిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, హెపటైటిస్ సి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
బ్లాక్ కాఫీ రోజూ పరగడుపున తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సార్కోమాస్ వంటి సమస్యలు దూరమౌతాయి. లివర్‌లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడుతుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీ అధ్యయనం ప్రకారం బ్లాక్ కాఫీలో ఉండే కొవ్వు లివర్‌ను సంరక్షిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే పోషకాలుంటాయి. అయితే రోజూ పరగడుపు తాగాల్సి ఉంటుంది.
బ్లాక్ కాఫీ అంటే చాలామందికి ఇష్టం. పని ఒత్తిడి తగ్గడమే కాకుండా నీరసం, అలసట వంటివి వెంటనే దూరమౌతాయి. రెగ్యులర్ కాఫీ అంత రుచిగా లేకపోయినా ఆరోగ్యపరంగా చాలా మంచిది.