తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్
తన గురువు ఫేమస్ సింగర్ అనుప్ జలోటాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఆయనకు ముద్దులు పెడుతూ బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసింది. దీంతో వీరు బయట కూడా పాపులర్ అయిపోయారు. అనుప్, జస్లీన్‌లు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సైతం ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ రియాలిటీ షో 12తో, 'ముజే షాదీ కరోగే' ద్వారా పాపులర్ అయింది సింగర్, నటి జస్లీన్ మాథారు. ప్రస్తుతం ఆమె బోల్డ్ ఫొటోలు ఇంటర్నెట్‌లో చాలా వైరల్ అవుతున్నాయి.
సింగర్ జస్లీన్ మథారు లైఫ్ స్టైల్‌ను ఆమె ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. తమకు నచ్చినతీరుగా జీవిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫొటోలు పోస్ట్ చేస్తుంది.
Jasleen Matharu బిగ్ బాస్ రియాలిటీ షో 12వ సీజన్‌లో ఆధ్యాత్మిక గాయకుడు అనుప్ జలోటాతో కలిసి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకంటే వయసులో 37 ఏళ్లు పెద్దవాడైన తన గురువు ఫేమస్ సింగర్ అనుప్‌తో చాలా సన్నిహితంగా ఉండేది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ అనుప్, జస్లీన్ జోడీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటోంది.
11 ఏళ్లకే క్లాసికల్‌తో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించింది జస్లీన్ మథారు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్‌లో 16ఏళ్ల వయసులో బెస్ట్ ఫిమెల్ సింగర్ అవార్డు అందుకుంది.
Love Day అనే ఆల్బమ్ రూపొందించి సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ద డర్టీ రిలేషన్ అనే మూవీతో సినీ అరంగేట్రం చేసింది.
ఫేమస్ సింగర్స్ మికా సింగ్, సుఖ్వీందర్ సింగ్, అంజాద్ ఖాన్‌లతో కలిసి భారీ కార్యక్రమాలలో లైవ్ ఫెర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది జస్లీన్ మథారు.