Shriya Saran: గాగ్రాలో మెరిసిపోయిన శ్రియ.. అందానికే అందంగా అనిపించినా హీరోయిన్
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ నటించి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రియ. తెలుగు ఇండస్ట్రీ తో తన ప్రయాణం మొదలపెట్టిన ఈ హీరోయిన్ హాలీవుడ్ వరకు చేరుకుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ నటించి మెప్పించింది శ్రియ. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో శ్రియాకి ఉండే క్రేజ్ వేరు.
ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. సంతోషం సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకొని, ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తరువాత శ్రియకి తమిళంలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. రజినీకాంత్ శివాజీ సినిమాతో అక్కడ సైతం ఆమె స్టార్ స్టేటస్ అందుకుంది.
ప్రస్తుతం హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేసిన శ్రియ.. కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలో సినిమాలు కొంచెం తగ్గించిన ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాత్రం ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక శ్రియ గాగ్రాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ప్రేమలో పడేస్తోంది.