Deepika Padukone: కల్కి బ్యూటీ దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటోషూట్.. భర్తతో కలిసి హల్ చల్.. ఫోటోలు వైరల్..

Mon, 02 Sep 2024-10:01 pm,

కల్కీ బ్యూటీ దీపికా పదుకొనే  తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె కల్కీ మూవీలో నటించి దిబెస్ట్ హీరోయిన్ గా అభిమానుల దగ్గర నుంచి మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా.. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె తన పాత్రకు తగిన విధంగా జస్టిస్ చేశారని చెప్తుంటారు.  

ఈ క్రమంలో దీపికా పదుకొనే , రణ్ వీర్ తో కొన్ని రోజుల పాటు వీరిమధ్య  ప్రేమ సాగింది. ఆతర్వాత వీరిద్దరు కూడా ఇరుకుటుంబాల అంగీకారంతో.. 2018 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి అప్పట్లో కూడా తెగ హల్ చల్ చేసిందని చెప్పుకొవచ్చు.

అంతేకాకుండా.. వీరిద్దరు కూడా.. రామ్ లీల, బాజీరావు మస్తానీ లాంటి పలు సినిమాలు నటించారు. పెళ్లి తరువాత కూడా దీపికా పలు సినిమాల్లో నటించారు. జవాన్, పఠాన్ లాంటి సినిమాలల్లో నటించారు.

ఈ ఏడాది ఫిబ్రవరీలో.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగెజ్ మెంట్ సమయంలో.. దీపికాపదుకొనే.. తన ప్రెగ్నెన్సీని అభిమానులతో పంచుకుంది.  దాదాపు ఐదేళ్ల తరువాత దీపికా ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెలిపింది. ఇక ప్రెగ్నెంట్ అయ్యాక కూడా దీపికా.. సినిమాలు చేస్తూనే వచ్చింది. 

నాలుగో నెలలో కూడా  దీపికా.. సింగం ఎగైన్ షూటింగ్ లో నటించారు. ఇక తెలుగులో దీపికా కల్కి 2898AD  మూవీలో ప్రమోషన్ లలో బేబీ బంప్ తో కన్పించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో కల్కీ ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా రికార్డులను తిరగరాస్తుంది.  ఇక తాజాగా, దీపికా పదుకొనే తన భర్తతో కలిసి బేబీ బంప్ షూట్ ఫోటో షూట్ దిగారు. దీనికి సంబంధించిన పిక్స్ ను ఇన్ స్టాలో పోస్టు చేశారు . ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. తొందరలోనే దీపికా పండంటి బిడ్డకు జన్మనివ్వబొతున్నట్లు తెలుస్తోంది.   

 బ్లాక్ కలర్ డిజైనర్ నెట్ లాంటి డ్రెస్ లో దీపికా ఎంతో అందంగా కనిపించింది. మొత్తం మూడు డిజైనర్ డ్రెస్ లతో ఈ బేబీ బంప్ ఫోటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. తన ఫెవరేట్ నటికి మంచి జరగాలని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరీ పుట్టబోయేది బాబో.. పాపనో తెలుసుకునేందుకు మరికొన్నిరోజులు మాత్రం ఆగాల్సిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link