Kareena and Kajol: సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న కరీనా, కాజోల్, కౌగిలించుకుని, ముద్దులు కూడా

ఈ కలయిక సందర్భంగా తన సోదరి కరిష్మా కపూర్‌కు కోవిడ్ సోకిందని కరీనా కపూర్..కాజోల్‌కు చెప్పింది.

సుదీర్ఘ కాలం తరువాత కలుసుకోవడంతో ఇద్దరూ ఒకరికొకరు కౌగిలించుకున్నారు. ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు.
ఏం జరుగుతోంది..అని కరీనా అడగడం, నీ న్యూ బేబీ ఎలా ఉందని కాజల్ అడగడం వీడియోలో స్పష్టంగా విన్పిస్తోంది. ఓహ్.వాడికి అప్పుడే ఏడాది వచ్చేసింది. మా అందరికీ కోవిడ్ పలకరించింది అంటూ కరీనా వివరించింది.
ఈ ఇద్దరి కలయికకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి కుటుంబం, కోవిడ్ మహమ్మారి, కరీనా కొడుకు జేహ్ గురించి అన్ని వివరాలు మాట్లాడుకున్నారు.
కరీనా కపూర్, కాజల్‌లు తాజాగా అంటే ఇవాళ ఉదయం ముంబైలోని మెహబూబ్ స్టూడియో బయట కలుసుకున్నారు. ఆశ్చర్యమేంటంటే ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ ఒకే తరహా డ్రెస్సింగ్‌తో ఉన్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు.