Sara Ali Khan Pics: పూల చీరలో మెరిసిపోతున్న సారా అలీ ఖాన్, ధరెంతో తెలుసా
సారా అలీ ఖాన్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. అందులో రంగు రంగుల పూల చీరలో ఆమె కన్పిస్తే ఇక అడ్డేముంటుంది.
సారా అలీ ఖాన్ ధరించిన ఈ చీర చాలా ప్రత్యేకమైంది. ఫ్లోరల్ శారీ తోరానీ క్లోడింగ్ బ్రాండ్‌కు చెందింది. ఈ చీర ఖరీదు 89 వేలు. ఇక ఈమె ధరించిన బ్లౌజ్ ఖరీదు 19 వేల రూపాయలు.
సారా అలీ ఖాన్ కట్టిన చీర ఇక్కడ చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. దాంతో పాటు పొట్లంలా ఉండే హ్యాండ్‌బ్యాగ్. హ్యాండ్‌బ్యాగ్ ఖరీదు ఏకంగా 18 వేల రూపాయలు. మరి చీర ఖరీదు ఎంతో తెలుసా...అక్షరాలా 89 వేల రూపాయలు
సారా అలీ ఖాన్ ఈ ఫోటోల్లో చాలా చాలా అందంగా కన్పిస్తోంది. మేకప్ పెద్దగా లేకుండా సహజ అందంతో మెరిసిపోతోంది. ఒక ఎథినిక్ లుక్‌లో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.
సారా అలీ ఖాన్ అంటే అభిమానులకు క్రేజ్ ఎక్కువ. అందుకే ఆమె ఏ ఫోటో షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న మర్డర్ ముబారక్‌లో కన్పించనుంది.