Sonakshi weds Zaheer Pics: సోనాక్షి-జహీర్ ఒక్కటయ్యారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
సోనాక్షి రెడ్ శారీలో కాస్సేపు అభిమానుల్ని ఫిదా చేసింది.
సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు,.
సోనాక్షి సిన్హా వెడ్స్ జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇన్‌స్టాలో ఇద్దరి అందమైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మా ఇద్దరి ప్రేమ ఎన్నో కష్టాల్ని దాటుకుంది. ఇవాళ ఈ క్షణం ఇలా పెళ్లి చేసుకున్నాం. భగవంతుని దయతో రెండు కుటుంబాల ఆశీర్వాదంతో భార్యాభర్తలయ్యాం అని కూడా పోస్ట్ చేశారు
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండిలో సోనాక్షి సిన్హా సహ నటులు అదితిరావు హైదరీ, సిద్ధార్ద్, అనిల్ కపూర్, హ్యుమా ఖురేషి హాజరయ్యారు.
ఈ ఇద్దరి మధ్య ఎప్పట్నించో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 2017 జూన్ 23న తొలిసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు
వయస్సులో జహీర్ కంటే సోనాక్షి రెండేళ్లు పెద్ద. బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరి పెళ్లి జరిగింది. వధూవరులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయాన్ని షేర్ చేశారు.
జహీర్ ఇక్బాల్ వెడ్స్ సోనాక్షి సిన్హా పెళ్లి ఆదివారం సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.