Bollywood Actors: యాక్టింగ్, సింగింగ్ ప్రావీణ్యం ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్స్
శ్రద్ధా కపూర్ తన మధురమైన గొంతుకతో ఎవరినైనా ఆకట్టుకోగలదు. గలియా, బేజుబా ఫిర్ సే, సబ్ తేరా వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకుంది.
ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హేంగోవర్, చాందీకీ డాల్ పర్, మే తేరా హీరో వంటి పాటలతో ఆకట్టుకున్నాడు. ఇక బిగ్‌బాస్ యాంకరింగ్‌తో సల్మాన్‌ను ఢీకొట్టేవాళ్లే లేరు.
ఫర్హాన్ అఖ్తర్ మల్టీ ట్యాలెంటెడ్ నటుల జాబితాలో మూడవ వ్యక్తి. ఎందుకంటే ఇతడికి నటనతో పాటు ఫిల్మ్ మేకింగ్, రైటింగ్, సింగింగ్ రంగాల్లో మంచి ప్రావీణ్యముంది. రాక్ ఆన్ పాట పాడింది ఇతడే.
ఆయుష్మాన్ ఖురానా..బాలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ నటుల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాడు. మిట్టీ దీ ఖుష్బూ, సాడ్డీ గలీ ఆజా, యహీ హూ మై, పానీ దా రంగ్, నజ్మ్-నజ్మ్ వంటి పాటలు ఇతడు పాడినవే
అలియా భట్ బాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ ఉన్న నటి. అలియా భట్ ఇటీవలే సంఝావా, ఎక్ కుడీ వంటి హిట్ పాటలు పాడింది.