Numerology: ఒకవేళ మీరు ఈ తేదీలో పుడితే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరు.. ఎక్కడకు వెళ్లినా సర్వ సుఖాలు..

Sat, 19 Oct 2024-10:57 am,

పుట్టిన తేదీ ప్రకారం ఒకరి కెరీర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడం సులభం. సంఖ్యా శాస్త్ర నిపుణుల ప్రకారం కొన్ని సంఖ్యల్లో పుట్టినవారి కెరీర్‌ అభివృద్ధికి త్వరగా బాటలు పడతాయి. వీరికి ఎందులో ఉన్న తిరుగుండదు. ఇందులో మీరు పుట్టిన తేదీ కూడా ఓసారి చెక్‌ చేయండి.  

పుట్టిన తేదీ 7: మీరు ఏదైనా నెలలో 7వ నంబర్‌ ర్యాడిక్స్‌ పుడితే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. 7 ర్యాడిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ తేదీల్లో పుట్టినవారికి సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు కూడా పొందుతారు. ఇష్టం వచ్చిన రంగంలో దూసుకు వెళ్తారు. వీరిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. విజయపథంలో ముందుకు వెళ్తారు.

పుట్టిన తేదీ 16: ర్యాడిక్స్‌ 7 అంటే 16 తేదీల్లో పుట్టినవారికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ తేదీలో పుట్టినవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్న అదృష్టవంతులు. వీరు ఏదైనా చిటికెలో నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ దీంతో వీరు కూడా లక్కీ. ఒకవేళ ఈ తేదీల్లో అమ్మాయి పుడితే ఆమె తన అత్తారింటికి కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది.

ర్యాడిక్స నంబర్‌ 7 అంటే 25వ తేదీకి కూడా వర్తిస్తుంది. ఈ తేదీలో పుట్టినవారు అనుకున్న పనులు చేస్తారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా వీరు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. నిత్యం వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ముఖ్యంగా వీరిపై సూర్య భగవాణుడి ఆశీస్సులు ఉంటాయి

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link