Brinjal bajji: వావ్.. యమ్మీ.. యమ్మీ.. వంకాయ బజ్జీ.. ఐదు నిముషాల్లోనే ఇలా చేసుకొవచ్చు..

సాయంత్రం అయిదంటే చాలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్నాక్స్ తినాలని ఉంటుంది. అలాంటి వారు.. గప్ చుప్ లు, మిర్చిబజ్జీలు లేదా మరేదైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్తుంటారు.

చాలా మంది మిర్చి బజ్జీలు ఉంటే తెగ పడిచస్తుంటారు. అయితే.. కొద్ది మందికి మాత్రమే వంకాబజ్జీని చేసుకుంటారు. అయితే.. వంకాయ బజ్జీని కూడా చేసుకొవడం చాలా ఈజీగా అని చెప్పుకొవచ్చు

మొదట వంకాయల్ని మార్కెట్ ల నుంచి తెచ్చుకొవాలి. ఆ తర్వాత వంకాయల్ని నీట్ గా శుభ్రం చేసుకుని క్లాత్ తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి.. వేడి అయ్యేవరకు చూడాలి.
ఆ గిన్నెలో వంకాయల్ని వేసి గోలించాలి. ఆ తర్వాత అవి కాస్తంతా కలర్ మారిన తర్వాత.. తీసి పక్కన పెట్టుకొవాలి. మరొక గిన్నెలో చెనగ పిండి తీసుకుని దానిలో నీళ్లు వేసి మిక్స్ చేయాలి. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఉప్పులను వేయాలి. ఇలా వేసిన తర్వాత దాన్ని కాసేపు ఉంచాలి.
వంకాయల్ని ముక్కలుగ కట్ చేసి.. ఈ మిక్సర్ పిండి ఉన్న దాంట్లో ముంచుకుంటూ.. గ్యాస్ మీద ఉన్న కడయ్ లో వేయాలి. అప్పుడు వేడి నూనెలలో సలసల కాగుతూ.. ఎర్రగా మారిన తర్వాత వంకాయ బజ్జీని బైటకు తీయాలి.
ఇలా చేస్తే.. అతి తక్కువ సమయంలో సాయంత్రం వంకాయ బజ్జీ స్నాక్స్ లా తినోచ్చు. అదే విధంగా ఎవరైన అతిథులు వస్తే.. రిస్క్ లేకుండా.. ఇలా ఈజీగా వంకాయ బజ్జీలు చేయోచ్చు.