BRS KCR: గొప్ప మనసు చాటుకున్న గులాబీ బాస్.. కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డకు 24 లక్షల రూపాయల చెక్కు..
తెలంగాణలో ఈరోజు ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి, ఉత్సవాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేసింది. అటు బీఆర్ఎస్ కూడా తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న పార్టీగా , ఉత్సవాలను తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం అనేది ఎందరో త్యాగాలు, ఆత్మబలిదానాల వల్ల సాకారమైందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
మాట తప్పని కేసీఆర్.. కిష్టయ్య ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. వీరి చదువులకు అయ్యే ఖర్చులన్ని మాజీ సీఎం కేసీఆర్ భరించుకుంటూ వచ్చారు. కిష్టయ్య కూతురు ఇటీవల పీజీ చదువుతుంది.
ఎంబీబీఎస్ కాలేజీలో ఉన్నత చదువుల కోసం మరోసారి కేసీఆర్ వీరికి అండగా నిలిచారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంకకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేశారు.
అంతేకాకుండా.. ఈ రోజు నందినగర్ లోని.. కిష్టయ్య కుటుంబంతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండని కిష్టయ్య పిల్లలకు మంచి మాటలు చెప్పారు.
కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి, ఆనాడేనేనున్నానని కేసీఆర్ అండగా నిలిచారు. ఆ మాట ప్రకారం.. ప్రతిసందర్భంలోను కేసీఆర్ ఆమాటను నిలుపుకుంటూ వస్తున్నారు. దీంతో గులాబీ బాస్ గొప్ప మనస్సు పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.