BSNL: ఈ బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్‌తో మీ సిమ్ 10 నెలలు యాక్టీవ్.. ఉచిత కాలింగ్‌తోపాటు డేటా ఫ్రీ..

పెరిగిన టెలికాం ధరలతో కస్టమర్లకు జేబుకు చిల్లుపడుతుంది. దీంతో వారు ఏ రీఛార్జీ ప్లాన్ బెస్ట్ అని సెర్చ్ చేస్తూ ఉన్నారు. మరికొందరు సెకండ్ సిమ్ రీఛార్జీ చేసుకోవచడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈనేపథ్యంలో ట్రయ్ వాయిస్ కాలింగ్ పై రీఛార్జ్ ధరలు తగ్గించాలని ఆదేశించడంతో ఎయిర్టెల్ జియో కంపెనీలు వాటి ధరలను తగ్గించేసాయి.

అయితే సెకండ్ సిమ్ వాడేవారు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారికి బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ పది నెలల రీఛార్జీ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. దీని వ్యాలిడిటీ 300 రోజులు మాత్రమే కాదు దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా పొందుతారు.

ఈ ప్యాక్ తో రీఛార్జి చేసుకోవాలంటే రూ.790 ధరతో ప్లాన్ కొనుగోలు చేయాలి. సెకండ్ సిమ్ కూడా యాక్టివ్ గా ఉండాలి అనుకునేవారు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు పది నెలలు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, మొదటి 60 రోజులు 2 జీబీ డేటా కూడా పొందుతారు. అంటే మొత్తంగా 120 జిబి ఉచితంగా పొందుతారు. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ.
అయితే, 60 రోజులు పూర్తయిన తర్వాత మీకు కావాలంటే టాప్ అప్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సట్లో కూడా అందుబాటులో ఉంటాయి. లేదా ఏదైనా యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లో కూడా రీఛార్జీ చేసుకోవచ్చు.
అయితే ఎక్కువ శాతం మంది సెకండ్ సిమ్ రీఛార్జ్ చేసుకోరు. మొదటి సిమ్ ద్వారానే కాలింగ్ చేస్తారు. వారికి కేవలం సెకండ్ సిమ్ యాక్టీవ్‌గా ఉంటే చాలు. అందుకే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ 10 నెలల సిమ్ వ్యాలిడిటీ ప్లాన్ సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి బెస్ట్. 300 రోజులపాటు మీ సిమ్ యాక్టివ్ గానే ఉంటుంది.