BSNL 5G SIM: BSNL కొత్త సిమ్ కావాలా? ఇలా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే మీ ఇంటికే వస్తుంది!
ఇలా ఎక్కువ వినియగదారులు పెరుగుతున్న నేపథ్యంలో మీకు అందుబాటులో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో సిమ్ కోసం క్యూ కట్టకుండా సులభంగా పొందే అవకాశం ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డును ఆన్‌లైన్ ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికే వస్తుంది. ప్రూన్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అది ఎలా ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ ఎలా ఆర్డర్ చేయాలి? దీనికి మీరు https://prune.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి ఆ తర్వాత సిమ్ కార్డు కొనడానికి బట్టన్ పై క్లిక్ చేయండి బీఎస్ఎన్‌ఎల్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాను నమోదు చేయాలి. మీ పేరు, ఫోన్ నంబర్ మిగతా వివరాలను నమోదు చేయాలి.
అప్పుడు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. మీరు సిమ్ డెలివరీ చేయాల్సిన ఇంటి అడ్రస్ కూడా నమోదు చేయాలి.
ఇలా చేస్తే సిమ్ కార్డు మీ ఇంటికి కేవలం గంటన్నరలోనే చేరుకుంటుంది. కేవైసీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఈ సదుపాయం హరియాణా, ఉత్తరప్రదేశ్ లో అందిస్తుంది.