BSNL Plan: డేటా ఎక్కువ వాడేవారికి బంపర్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ డేటా ఉచితం..
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ రూ.1515 ధరలో అందుబాటులో ఉంది. ఇందులో హైస్పీడ్ డేటా ప్రతిరోజూ పొందడంతో ఎక్కువ డేటా వినియోగించే యూజర్లకు ఇది అద్భుతమైన ఆఫర్. ఈ రీఛార్జీ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు వర్తిస్తుంది. ఈ ప్యాక్ వివరాలు తెలుసుకుందాం.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1515 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ధరలో ఏ టెలికాం కంపెనీ కూడా అందించడం లేదు. అంతేకాదు ఈ ప్లాన్‌లో మీరు ఉచిత కాలింగ్, ప్రతిరోజూ ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. కానీ, ఈ ప్లాన్ పొందాలంటే మీరు ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ బేస్ ప్లాన్ రీఛార్జీ చేసుకుని ఉండాలి.
బీఎస్‌ఎన్‌ఎల్ ఈ అద్భుతమైన రీఛార్జీ ప్లాన్‌లో మీరు అదనంగా 24 జీబీ అదనంగా పొందుతారు. దీని వ్యాలిడిటీ 24 రోజులు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ఆఫర్ మీరు కూడా పొందాలంటే అక్టోబర్ 1 నుంచి 24 మధ్య రీఛార్జీ చేసుకోవాలి.
ఈ రూ.1515 డేటా వోచర్ ప్లాన్‌లో కస్టమర్లు ప్రతిరోజూ 2 జీబీ డేటా హైస్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు. 365 రోజుల వ్యాలిడిటీతో 730 జీబీ పొందుతారు. ఒకవేళ మీరు ఒక్కరోజులో 2 జీబీ వాడేసినా ఇంటర్నెట్ ఆగిపోదు. ఆ తర్వాత 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. ఈ బెనిఫిట్స్ అన్ని ఏడాది మొత్తం పొందుతారు.
ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ దేశవ్యాప్తంగా అందించడానికి కృషి చేస్తోంది. అతిత్వరలో దేశవ్యాప్తంగా 4 జీ సేవలను అందించడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది.