BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..

Tue, 20 Aug 2024-12:06 pm,

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త రీఛార్జ్‌ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ ధర కేవలం రూ.997. ఇందులో మీరు 160 రోజులపాటు ప్లాన్‌ వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 5 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది.  

ఈ ప్లాన్‌తోపాటు ప్రతిరోజూ మీరు 2GB డేటా, ఐదు నెలల మొత్తం 320GB పాటు అందించనుంది. అంతేకాదు ఇందులో ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం, దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్‌ పొందే అవకాశం.  

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త ప్లాన్‌లో భాగంగా మీరు కొన్ని వ్యాల్యూ యాడెడ్‌ సేవలు కూడా పొందుతారు. హార్డీ గేమ్స్, జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌ అంటే కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్టివిటీతోపాటు ఎంటర్‌టైన్మెంట్‌ను కూడా అందిస్తోంది.  

బీఎస్‌ఎన్‌ఎల్‌ అక్టోబర్‌ 15 నుంచి  4 జీ సేవలను ప్రారంభించనుంది. 25 వేల 4జీ సైట్లను కూడా ఇన్‌స్టాల్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సర్వీస్‌ ట్రయల్‌ స్టేజీని కూడా పూర్తి చేసుకుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సిమ్‌లను కూడా అందుబాటులో ఉంచింది.  

మొత్తానికి ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.997 రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ, డేటా, కాలింగ్‌ సర్వీసులు కూడా పొందుతారు. భవిష్యత్తులో 5 జీ సేవలను కూడా అందించేందుకు కూడా ప్రణాళికలు వేస్తూ ఇతర టెలికాం దిగ్గజ కంపెనీలకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ గట్టి పోటీనే ఇస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link