BSNL: వామ్మో అతిచౌకైన ఏడాది రీఛార్జీ ప్లాన్.. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని బంపర్ ఆఫర్..
బీఎస్‌ఎన్‌ఎల్ 336 రీఛార్జీ లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో కస్టమర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రభుత్వరంగ కంపెనీ జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి దిగ్గజ ప్రైవేటు రంగ కంపెనీలకు దీటుగా దూసుకువెళ్తుంది.
ఈరోజు బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్‌లు పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తికాలంలో 24 జీబీ డేటా అంటే నెలకు 2జీబీ డేటా అందిస్తోంది.
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ డేటా కంటే వాయిస్ కాలింగ్‌కు ఉపయోగించే కస్టమర్లకు సరిపోతుంది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు ఈ బీఎస్‌ఎన్‌ఎల్ సరైన పోటీని అందిస్తోంది. ఇప్పటి వరకు ఏ టెలికాం దిగ్గజ కంపెనీలు కూడా ఈ ధరలో లేవు.
బీఎస్‌ఎన్‌ఎల్ మరో అద్భుతమైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.1999 కు పొందవచ్చు. ఇది కూడా మీకు లాంగ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది. 365 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో ప్రతిరోజూ మీరు 1.5 జీబీ డేటా కూడా అందుకుంటారు.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1999 ప్లాన్‌లో ప్రతి రోజు వంద ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది కూడా లాంగ్ టర్మ వ్యాలిడిటీ ప్లాన్. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ అందిస్తోంది.