BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!
టెలికాం ధరలు విపరీతంగా పెరగడంతో ఛార్జీలు భరించలేక ఇప్పటికే ఎంతో మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తమ సర్వీసును దేశవ్యాప్తంా విస్తరిస్తుంది. 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. సిమ్ కార్డు హోం డెలివరీ కూడా చేస్తోంది.
అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ అతి చౌకైన ప్లాన్‌ను మీ ముందుకు తీసుకుచ్చింది. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీకి ఇది సాధ్యం కాలేదు. ఇక పై పాత ధరలోనే మీరు రీఛార్జీ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ వంద రూపాయల లోపు రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది అంటే మీరు నమ్ముతారా? అది కూడా ఎక్కువ కాలంపాటు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది.
ఏ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ చేయని ధరలలో బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. దీంతో ఇతర టెలికాం కంపెనీలకు బీఎస్‌ఎన్‌ఎల్ గట్ట పోటీనే అందిస్తోందని చెప్పాలి. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 91 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రూ. 91 ప్లాన్ ను ఇప్పటి వరకు ఏ టెలికాం దిగ్గజం అందించడం లేదు. ఇందులో మీకు 90 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. అయితే, తమ సిమ్ కార్డును యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారు అతి తక్కువ ధరలోనే ఈ రీఛార్జీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఈ 90 రోజుల బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ సిమ్ యాక్టీవ్‌గా ఉంచడమే కాకుండా మీకు అదనంగా నిమిషానికి 15పైసలు వాయిస్ కాల్స్, ఒక పైసాకు MB డేటా కూడా లిభిస్తుంది. అంతేకాదు ఇందులో 25 పైసలకు ఒక ఎస్‌ఎంఎస్ కూడా పంపించుకోవచ్చు. అయితే, వినియోగదారులు కాల్స్ మాట్లాడాలన్నా, డేటా వాడాలన్నా అదనంగా టాక్ టైం వోచర్లు, డేటా వోచర్లు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా అతితక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మరో ప్లాన్ రూ.107 .ఇది తక్కువ నెట్ వాడే వినియోగదారులకు సరిపోతుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్ 35 రోజుల వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. కానీ, ఈ రీఛార్జీ ప్లాన్‌లో 200 కాలింగ్ మినట్స్ అందుబాటులో ఉంది.
అయితే, ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌లో 35 రోజుల వరకు కేవలం 3 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. మొబైల్ డేటా అతి తక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది.