BSNL IFTV: ఈ రాష్ట్రంలో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ IFTV సేవలు.. సెటప్ బాక్స్ లేకుండా 500 లైవ్ ఛానల్స్..
బీఎస్ఎన్ఎల్ 500 లైవ్ టీవీ ఛానల్స్ సేవలను ప్రారంభించింది. మరో రాష్ట్రంలో ఈ టెలికాం కంపెనీ లైవ్ ఛానల్స్ హెడీ క్వాలిటీలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా పొందే అవకాశం కల్పించింది. బిఎస్ఎన్ఎల్ ఈ సేవలు పాత ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీ రెండిట్లో కూడా ఫైర్ స్టిక్ ద్వారా ఆస్వాదించవచ్చు.
ఈ సేవలను ఇప్పుడు గుజరాత్ లో కూడా అధికారికంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ వెల్లడించింది. అంతకు ముందే తమిళనాడు ,మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఈ IFTV సేవలను ప్రారంభించింది.
బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టూ మొబైల్ (D2M) సర్వీస్ ని కూడా ప్రారంభించింది. దీన్ని బై టీవీ అంటారు. పుదుచ్చేరిలో ఈ సేవలను మొదలుపెట్టింది. ఈ సేవల ద్వారా మొబైల్ యూజర్ లో 300 లైవ్ టీవీ ఛానల్స్ ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.
ఇక బిఎస్ఎన్ఎల్ IFTV సర్వీస్ ద్వారా వినియోగదారులు ఫైబర్ బెస్ట్ ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ని పొందవచ్చు. ఇందులో 500 టీవీ లైవ్ చానల్స్ ప్రీమియం పే టివి కంటెంట్ క్వాలిటీలో పొందుతారు.బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ యూజర్స్ ఈ సేవలతో బెనిఫిట్స్ పొందుతారు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు.
బిఎస్ఎన్ఎల్ 4g, 5g సేవలను కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష కొత్త మొబైల్ టవర్స్ ను కూడా ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది. 60,000 టవర్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేసింది. ఇదిలా ఉండగా బిఎస్ఎన్ఎల్ 3g సర్వీస్ జనవరి 15వ తేదీ నుంచి అందుబాటులో ఉండదు. వినియోగదారులు 3జీ సేవలు పొందలేరు, 4జి కు అప్‌గ్రేడ్ చేస్తోంది.