BSNL Powerful Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న 300 రోజుల వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్..

Tue, 03 Sep 2024-1:11 pm,

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎయిర్‌టెల్, జియోలకు చెక్‌ పెడుతూ అనేక రీఛార్జీప్లాన్లను తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తోంది. అందుకే మిలియన్ల కొద్దీ మన దేశీ టెలికాం యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరిన్ని ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది.  

ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే 9 నెలలపాటు నిరంతరాయంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇది ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీని అందిస్తూ వెయ్యి రూపాయల లోపే ఏడాది పాటు రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.  

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్స్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రతి కేటగిరీ కస్టమర్లకు తగినవిధంగా ప్లాన్లలో మార్పులు చేసింది. ఈసారి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎలాంటి రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది అంటే అవి ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలు కనీసం కనీవినీ ఎరుగరు. ఈ ప్లాన్‌లో 300 రోజుల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే పొందుతారు.  

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 979 ప్లాన్‌ ఇందులో అన్‌లిమిటెడ్‌ ఫ్రీ కాల్స్‌ ఏ నెట్‌వర్క్‌ అయినా 300 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. ఒక్కసారి ఈ ప్లాన్‌ తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు ఎంజాయ్‌ చేయవచ్చు. అంతేకాదు డేటా ఎక్కువగా వినియోగించే వారికి బెస్ట్ ఆప్షన్‌. ఇందులో మొదటి 60 రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా మొదటి రెండునెలలపాటు పొందుతారు.  

ఇతర కంపెనీలు కూడా పవర్‌ఫుల్ ప్లాన్ రూ.797 అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ కూడా 300 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. కానీ, ఈ కంపెనీలు ఈ ధరల్లో కేవలం 84 రోజులు, 90 రోజులు మాత్రమే అందిస్తున్నాయి. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏడాదిపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link