BSNL New Plan: ఇది కదా కావాల్సింది..! ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తక్కువ ధరలోనే ప్లాన్.. డైలీ 2జీబీ డేటా రోజుకు రూ.7 మాత్రమే..
రీఛార్జీ ప్లాన్ ఎక్స్‌పైరీ అవ్వడానికి వస్తుంది అనగానే ప్రతి కస్టమర్ యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రస్తుతం టెలికాం కంపెనీలు రీఛార్జీ ప్యాక్ ధరలను అంతలా పెంచేశారు. తక్కవ ధరలో ఏ రీఛార్జీ ప్లాన్ పొందాలి అని తెగ సెర్చ్ చేస్తారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరలోనే రీఛార్జీ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లన పరిచయం చేస్తూ ఎక్కువ మంది కస్టమర్లను కూడా ఆకట్టుకుంటోంది.
ఎక్కువరోజులు వ్యాలిడిటీ ఇచ్చే ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలు ఎక్కువ ధరల భారం వినియోగదారులపై మోపుతున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ రీఛార్జీ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ ఇందుకు భిన్నంగా తక్కువ ధరలోనే ప్యాక్‌లను అందుబాటులో ఉంచుతూ దిగ్గజ ప్రైవేటు కంపెనీలకు దీటుగా పయనిస్తోంది.
మిలియన్లకొద్దీ అట్రాక్ట్ అవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్ లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ఏంటో తెలుసా? బీఎస్‌ఎన్‌ఎల్ 105 రోజుల ప్లాన్. ఇది కేవలం రూ.666. ఈ ప్యాక్‌లో అపరిమిత కాల్స్, 105 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. అదనంగా 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌లో 210 జీబీ డేటా కూడా అందిస్తోంది. ఇది వ్యాలిడిటీ ముగిసే వరకు వర్తిస్తుంది. అంటే ప్రతిరోజూ 2జీబీ డేటా పొందుతారు. ఈ ప్లాన్ దరిదాపుల్లో ఏ దిగ్గజ రీఛార్జీ ప్లాన్స్ కూడా అందుబాటులో లేవు.
ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేసే దిశలో అడుగేస్తుంది. దీంతో 4 జీ సేవలు సులభంగా పొందవచ్చు. ప్రస్తుతం 24 వేల టవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
జూన్ నెలలో పెరిగిన టెలికాం ధరల వల్ల వినియోగదారుని పై కనీసం 20 శాతం వరకు అదనపు భారం పడిన సంగతి తెలిసిందే. దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్, జియోలు రీఛార్జ్ ట్యారిఫ్‌లను పెంచేశాయి.