BSNL Value Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా తక్కువే కానీ, రెండిటిలో ఏది బెస్ట్ తెలుసా?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇటీవలె అనేక కొత్త ప్లాన్‌లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇతర టెలికాం కంపెనీల కంటే బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు అతితక్కువ ధరకే డేటా కూడా పొందుతారు.
సుదీర్ఘ వ్యాలిడిటీతోపాటు తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది బీఎస్‌ఎన్‌ఎల్ . ఈరోజు కేవలం రూ.200 లోపు లభించే రెండు ప్లాన్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండిటిలో ఏది బెస్ట్ మీరే ఎంచుకోండి. ఇందులో 70 రోజుల వ్యాలిడిటీ కూడా పొందుతారు.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.199 రీఛార్జీ ప్లాన్.. రూ.199 ఈ రీఛార్జీ ప్లాన్ వినియోగదారులు 2జీబీ డేటా, ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. ఇది 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఈ రీఛార్జీ ప్లాన్‌లో పూర్తిగా 60 జీబీ డేటా కూడా ఉచితంగా పొందవచ్చు.
అంతేకాదు అదనంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండే ఢిల్లీ ముంబైలలో ఫ్రీ కాలింగ్ రోమింగ్ కూడా పొందవచ్చు.
రూ.197 ప్లాన్.. ఈ రీఛార్జీ ప్లాన్ ధర రూ. 197 ఇందులో వినియోగదారులు 70 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇది ఇతర టెలికాం కంపెనీల రీఛార్జీ ప్లాన్‌లతో పోలిస్తే అతితక్కువే. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అదనంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ 18 రోజులపాటు పొందుతారు. పూర్తిగా 36 జీబీ డేటా లభిస్తుంది. 70 రోజులపాటు ఫ్రి ిఇన్‌కమింగ్ సదుపాయం కూడా పొందుతారు.
ఈ రెండిటిలో ఏది బెస్ట్? మీకు డేటా ఎక్కువ కావాలి 2GB డేటా ప్రతిరోజూ నెలరోజుల పాటు అంటే రూ.199 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. కవేల మీకు కేవలం లాంగ్ టైమ్ వ్యాలిడిటీ సిమ్ కార్డు యాక్టివేషన్‌కు మాత్రమే అయితే, రూ.197 ప్లాన్ బెస్ట్.