BSNL Top 5 Recharge Plans: ఎయిర్‌టెల్-జియో-ఐడియాను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్ టాప్ 5 రీఛార్జీ ప్లాన్స్..
జూలై 3 నుంచి అన్నీ టెలికాం కంపెనీలు దాదాపు 25 శాతంమేర ధరలను పెంచేశాయి. ఇదిలా ఉండగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటు ధరలోనే ఉంటాయి. ఈరోజు బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న టాప్ 5 రీఛార్జీ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.
బీఎస్ఎన్‌ఎల్ ప్రస్తుత యూజర్లకు ఇతర నెట్వర్క్ నుంచి పోర్ట్ అయ్యేవారికి ఈ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటు ధరలో ఉండనున్నాయి. బీఎస్‌ఎన్ఎల్ దేశవ్యాప్తంగా జమ్మూ,కశ్మీర్, అసోంలో కూడా 4జీ నెట్వర్క్ స్పీడ్‌తో సేవలను అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.107 రీఛార్జీ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ, 4 జీబీ, 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ పొందే అవకాశం. అలాగే, రూ. 108 ఫస్ట్ రీఛార్జీకూపన్ (FRC) కొత్త యూజర్లకు 1జీబీ డేటా 4జీ స్పీడ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
అంతేకాదు బీఎస్ఎన్‌ఎల్ మరో అద్భుతమైన రీఛార్జీ ప్లాన్ రూ.197. ఈ రీఛార్జీ ప్లాన్ 70 రోజులు వ్యాలిడిటీతో 2జీబీ డేటా, 4జీ స్పీడ్‌తో లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ 70 రోజులపాటు నిరంతర కాల్స్ కేవలం రూ. 199కే లభిస్తుంది.
రూ.397 ప్లాన్‌తో 150 రోజులపాటు మరో బీఎస్ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ లభిస్తుంది. ఇందులో 2జీబీ డేటా, 4జీ స్పీడ్‌తో ఒక నెలపాటు వర్తిస్తుంది. రూ. 797 ప్లాన్‌తో 300 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 2 జీబీ, 4జీ డేటా రెండు నెలలపాటు వర్తిస్తుంది.
ఇక బీఎస్ఎన్‌ఎల్ రూ. 1999 రీఛార్జ్ ప్లాన్ 365 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఈ ప్యాక్‌లో 600జీబీ, 4జీ డేటా స్పీడ్ లభిస్తుంది. అంతేకాదు ఏడాదిపాటు బీఎస్ఎన్‌ఎల్ ట్యూన్స్, థర్డ్ పార్టీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా సర్వీసు పొందే అవకాశం లభిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్ నెట్వర్క్ మొబైల్ రీఛార్జీ ధరలు తగ్గించుకోవాలనుకునేవారికి ఇది బెట్టర్ ఆప్షన్.