BSNL Republic Day 2021 Offer: రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

BSNL Recharge Offer: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ఆఫర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రెండు పెద్ద ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ప్రకటించింది.
Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం

దీర్ఘకాల వ్యాలిడిటీ ఆఫర్లు అందించడంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi)లను బీఎస్ఎన్ఎల్ అధిగమించింది. 72 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 72 రోజులపాటు అధిక వ్యాలిడిటీ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్(BSNL) తెలిపింది.

రూ.2,399తో బీఎస్ఎన్ఎల్ లాంగ్ టర్మ్ ప్రిప్రెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్నవారికి 72 రోజుల అధిక వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రస్తుతం 365గా ఉన్న వ్యాలిడిటీని 437 రోజులకు పొడిగించింది.
జనవరి 31వరకు రీఛార్జ్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ప్రతిరోజూ 3 GB డేటా వినియోగదారులు పొందవచ్చు. కానీ ప్రమోషన్ పీరియడ్‌లో 250 నిమిషాల ఉచిత కాలింగ్ వర్తించదని తెలిపారు. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్రిపేయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 21 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా అయితే 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నారు. అయితే అదనంగా 21 రోజులతో కలిపి 386రోజుల కొత్త వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రతిరోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ఆఫర్లు అందించనుంది.
Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు