Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..
బుద్ద పౌర్ణమి రోజు గౌతమ బుద్ధుడు జన్మించాడు అని నమ్ముతారు. ఈసారి బుద్ధ పౌర్ణిమ మే 23 న జరుపుకోనున్నారు. అయితే ఈ బుద్ధ సిద్ధి యోగం శివయోగం రెండు ఏర్పడుతున్నాయి. శుక్రుడు సూర్యుడు కలయిక వల్ల శుక్రాధిత్య యోగం కూడా ఉంటుంది. రోజంతా బుద్ధ పూర్ణిమకు శుభదినం.
బుద్ధ పూర్ణిమ రోజు గౌతమ బుద్ధుడు పుట్టాడని పురాణాల ప్రకారం తెలుస్తోంది ముఖ్యంగా కొంతమంది ఈరోజు సత్యనారాయణ కథను కూడా ఇంట్లో పారాయణం చేస్తారు. పూర్ణిమ అంటేనే జ్ఞానంకి ప్రతీక ఈరోజు కొన్ని పరిహారాలు చేయటం వల్ల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజు దానానికి ప్రాముఖ్యత కలిగింది కొంతమంది ఈరోజు గొడుగులు వంటివి దానం చేస్తారు ఈరోజు రావి చెట్టుకు పూజలు చేస్తారు.
ఒక బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుడి పుట్టుక జ్ఞానం మోక్షం ఇవి మూడు జరిగినాయి అని నమ్ముతారు అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు దేశవ్యాప్తంగా కూడా బుద్ధునికి సంబంధించిన అనేక కట్టడాలు స్మారకాలు ఉన్నాయి. అంతేకాదు ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల ఇంటికి సుఖశాంతులు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు గౌతమ బుద్ధుని ప్రతిమను కొనుగోలు చేసేవారు చాలామంది ఉంటారు .
గౌతమ బుద్ధుడు ఆఫీస్ డెస్క్ లో పెట్టడం వల్ల ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖశాంతులు వర్ధిల్లుతాయి ఈరోజు పసుపు బట్టలు కొనుగోలు చేయడానికి కూడా శుభదినం ఇలా చేయడం వల్ల అధిక సంక్షోభం నుంచి బయటపడతారు.
అంతేకాదు గౌతమ బుద్ధుని బుద్ధ పూర్ణిమ రోజు గవ్వలను కోలుగోలు చేసే ఆచారం కూడా ఉంది గవ్వలంటేనే లక్ష్మీదేవికి ప్రతీక సంపాదన నిలిచి ఉంటుంది. గౌతమ బుద్ధుని పుట్టుక రోజు అయిన బుద్ధ పౌర్ణిమ రోజు వెండి నాణం కూడా కొనుగోలు చేసేవారు ఉన్నారు.
ఇది కాకుంటే ఏనుగును కూడా అంటే ఇత్తడి ఏనుగును కొనుగోలు చేస్తే కూడా ఇంట్లో జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)