Budget 2023: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది వీరే..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత అందుకోనున్నారు.
ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి T.V. సోమనాథన్. 1987 బ్యాచ్ IAS అధికారి. ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన 2015 నుండి 2017 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో కూడా పనిచేశారు.
ఈయన పేరు అజయ్ సేథి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బడ్జెట్ మేకింగ్ టీమ్‌లోని అతి ముఖ్యమైన సభ్యులలో ఈయన ఒకరు. G20 సెంట్రల్ బ్యాంక్ మరియు ఆర్థిక మంత్రి సమావేశాలకు సహ-అధ్యక్షునిగా వ్యవహారిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం అనేక రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం DIPAM అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తుహిన్ కాంత పాండే కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ఎయిరిండియా అమ్మకంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు
సంజయ్ మల్హోత్రా ఇటీవలే రెవెన్యూ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆయన ఆర్థిక సేవల విభాగంలో ఉన్నారు. ఆదాయ అంచనాలను సమతూకం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తారు.
ఆర్థిక శాఖలో వివేక్ జోషి కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ముఖ్యమైన బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో బ్యాంకింగ్ రంగంలో తీసుకున్న నిర్ణయాల్లో ఈయనదే ముఖ్యపాత్ర.