Budh Gochar 2022: డిసెంబర్ 3 నుంచి ఆ నాలుగు రాశులవారు తస్మాత్ జాగ్రత్త, భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధగోచారం ప్రభావం మేషరాశిపై ప్రతికూలంగా ఉంటుంది. వ్యక్తి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ రాశి జాతకులకు మందులు దుష్ప్రభావం చూపించి చర్మరోగాలు రావచ్చు. గోచారం సందర్భంగా రహస్య శత్రువులు పెరుగుతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
బుధ గోచారం కారణంగా వృశ్చికరాశి జాతకుల కెరీర్, వ్యాపారంలో వృద్ధి కన్పిస్తుంగది. ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం లభిస్తాయి. ఒకసారి అనుకుంటే పూర్తి చేసే తీరుతారు. ఎన్నికల ఫలితాల వ్యవహారమైతే..విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే..గోచారం శుభంగా ఉంటుంది.
ధనస్సు రాశిపై బుధ గోచారం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. దాంపత్య జీవితంలో విభేదాలు రావచ్చు. అయితే ఏదైనా టెండర్ అప్లై చేయాలంటే అనుకూలంగా ఉంటుంది
బుధ గోచారం ప్రభావం మిధునరాశి జాతకులకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎత్తుపల్లాలు తప్పవు. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు బయటే పరిష్కరించుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.