Government Job: ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం.. రూ. 1,77,000 లక్షల జీతంతో బంపర్ జాబ్..
ఐఐఎంసీ అధికారిక వెబ్‌సైట్ iimc.gov.in ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ ఆఫీసరల్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (ఆడియో/వీడియో) లైబ్రరీ క్లెర్క్.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంది. 2024 ఆగస్టు 5 చివరితేదీ. ఆగస్టు 12 వరకు హార్డ్ కాపీ ప్రింట్ తీసుకునే సదుపాయం కలదు. ఇనిస్టిట్యూట్‌కు ఈ తేదీలోగా మీ అప్లికేషన్ చేరాలి. అందులో పొందుపరచిన డాక్యుమెంట్స్ కూడా సరిచూసుకోవాలి. పోస్టల్ ద్వారా పంపిస్తే మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో ఎన్వెలప్‌పైన రాయాలి.
ఐఐఎంసీ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారి వయస్సు, అర్హత వివరాలు తెలుసుకుందాం. అధికారిక వెబ్‌సైట్ వీటికి సంబంధంచిన వివరాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వివరాలు క్షుణ్నంగా చదివిన తర్వాతే అప్లై చేయాలి.
ఈ ఖాళీల భర్తీలో ఎంపికైన అభ్యర్థులకు రూ.56,000-1,77,500 వరకు రేంజ్‌ను బట్టి జీతాలు అందించనున్నారు. అసిస్టెంట్ లైబ్రరీ రూ. 44,000-1,42,000 వరకు అందిస్తారు. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ. 35,000-1,12,000 వరకు అందిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పాసైన అభ్యర్థులకు నైపుణ్యత టెస్ట్, ఇంటర్వ్యూ చేస్తారు. ఇది గ్రూప్ ఏ పోస్టులకు నిర్వహిస్తారు. గ్రూప్ బీ, సీ పోస్టుకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సెలక్షన్ కమిటీ తుదిఎంపిక చేస్తారు.