IRCTC Tour Package: అతితక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయిల్యాండ్ టూర్ ప్యాకేజీ.. వివరాలు తెలుసుకోండి..
ముఖ్యంగా థాయిల్యాండ్ అంటే భూలోక స్వర్గం. ఇక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్లాలనుకుంటారు. ఇక్కడి సహజసిద్ధమైన అందాలు, వివిధ రిసిపీలు, ఎంజాయ్‌మెంట్‌కు పెట్టింది పేరు. థాయిల్యాండ్ అన్ని రకాల ట్రావెలర్స్‌కు ఎంతో నచ్చుతుంది. మీరు కూడా థాయిల్యాండ్ వెళ్లాలనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్. ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని మీ ముందుకు తీసుకువచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ ఐదు రోజుల ట్రిప్ 2024 ఆగస్టు 23న ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో మీరు బ్యాంకాక్, పట్టాయా పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్తార. అంతేకాదు థాయిల్యాండ్ ప్రత్యేక బుద్ధిస్ట్ ఆలయం, వైల్డ్‌లైఫ్ , బ్యాంకాక్ సిటీని తిప్పి చూపిస్తారు.
ఇందులో స్రీరచా టైగర్ సంక్చువరీ, పట్టాయాలోని అల్కాజర్ షో, కోరల్ ఐల్యాండ్ స్పీడ్ బోట్ ట్రిప్, పట్టాయా ఫ్లోటింగ్ మార్కెట్, నోంగ్ నూచ్ బొటానికల్ గార్డెన్, సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్‌ను చూడవచ్చు.
ఈ టూర్ ధర రూ. 57,650 తో ప్రారంభవుతుంది. ఇది రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టిక్కెట్లు కలిగి ఉంటుంది. కొచ్చి నుంచి బ్యాంకాక్ వెళ్తుంది. ఇందులో ఏసీ వెహికల్ ట్రాన్స్‌పొర్టేషన్, అకామిడేషన్, రెస్టారెంట్‌లో భోజన సదుపాయం కలిగి ఉంటుంది.
వివిధ దర్శనీయ ప్రాంతాలతోపాటు ఇంగ్లిష్ మాట్లాడే లోకల్ గైడ్, విసా ఎక్స్‌పెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 8547845881 నంబర్ ను సంప్రదించవచ్చు. లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లో కూడా వివరాలు ఉన్నాయి.