Top Small Business Ideas 2024: సూపర్‌హిట్ ఐడియా.. దసరా-దీపావళి సీజన్స్‌లో నెలలోనే రూ.1 లక్ష సంపాదించవచ్చు!

Thu, 03 Oct 2024-1:11 pm,

అక్టోబర్‌ నెల వచ్చిందంటే నెల వచ్చింది చిన్న వ్యాపారాలకు భారీగా గిరాకీ లభించినట్లే. ఎందుకంటే ఈ సీజన్‌లో వరసుగా పండుగలు వస్తాయి. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగులతో బిజినెస్‌లు జోరుగా సాగుతాయి. అయితే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఇది బెస్ట్ టైం.   

దీపావళి వంటి పండుగల సమయంలో అదనపు ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇందులో విద్యుత్ దీపాలు, అలంకరణ ఉత్పత్తులు, మట్టి దీపాలు వంటి వస్తువుల విక్రయం కూడా ఒకటి. ఈ వ్యాపారాన్ని స్టార్‌ చేయడం ఎలా..? ఎంత లాభాం పొందవచ్చు..? ఎంత పెట్టుబడి పెట్టాలి..? అనే విషయాలు తెలుసుకుందాం. 

బిజినెస్‌ నిపుణుల ప్రకారం ఎలాంటి వ్యాపారం అయిన మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్‌ ఉండటం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఉత్పత్తి డిమాండ్‌ బట్టి ఆదాయం పెరుగుతుంది అలాగ బిజినెస్ మెరుగా కొనసాగుతుంది.   

మన దేశంలో ప్రతి నెలలకోసారి ఏదో ఒక పండుగ జరుగుతుంది. అందులో ముఖ్యంగా దీపావళి, నవరాత్రాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో క్యాండిల్స్‌, మట్టి దీపాలు, ఎలక్ట్రిక్ దీపాలుకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది.   

దీపావళి సమయంలో  చాలా మంది ఇళ్లను రంగురంగుల కొవ్వొత్తులు, ఎలక్ట్రిక్ దీపాలతో అలంకరించేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో బిజినెస్‌ ను స్టార్ట్ చేస్తే డిమాండ్‌  కూడా పెరుగుతుంది. దీని కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 

ఈ బిజినెస్‌ ప్రారంభించడానికి కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఎలాంటి అదనపు యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. కొవ్వొత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పదార్ధాలు, అచ్చులు, డిజైన్‌ కొవ్వొత్తుల కోసం వేర్వేరు అచ్చులను ఉపయోగిస్తే సరిపోతుంది.

ఈ బిజినెస్‌ను ఇంట్లో కూడా చేయవచ్చు లేదా కొంతమంది వర్కర్స్‌ను పెట్టుకొని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. దీంతో  బిజినెస్‌ కూడా పెరుగుతుంది. లాభాలు కూడా భారీగా వస్తాయి. అంతేకాకుండా  ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బిజినెస్‌ ను రన్‌ చేయవచ్చు. 

ఈ జిబినెస్‌తో మీరు రూ. 1,00,000 సంపాదించవచ్చు. బిజినెస్‌ మొదలు పెట్టడానికి ప్రధన మంత్రి ముద్ర లోన్‌ పథకం కూడా తీసుకోవచ్చు. ఈ చిన్న బిజినెస్‌ లు భారీ లాభాలను ఇస్తాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link