Best Business Ideas: మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్
ప్రస్తుత కాలంలో వివాహ వేడుకలు, శారీ ఫంక్షన్లు, పుట్టినరోజులు ఇలా సందర్భం ఏదైనా చేతికి మెహందీ వేసుకోవడం మాత్రం మర్చిపోవడం లేదు. మెహందీ ఆర్టిస్టులకు ప్రస్తుతం డిమాండ్ భారీగా ఉంటుంది. ప్రతి వివాహ వేడుకల్లోనూ మెహందీ కోసం ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మెహందీ ఫంక్షన్ లో మెహందీ ఆర్టిస్టులకు మంచి మొత్తంలో డబ్బు కూడా చెల్లిస్తున్నారు. మెహందీ ఫంక్షన్లలో ఒక్కరోజు పని చేసినందుకు ఒక్కో ఆర్టిస్టుకు 5 వేల నుంచి పదివేల వరకు చెల్లిస్తారు ఇలాంటి ఫంక్షన్లు పెళ్లిళ్ల సీజన్లో నెలకు ఒక 10 చేసుకున్నా కనీసం 50 వేల రూపాయలు మీ సొంతం అవుతాయి.
నిజానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజు పని దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే నెలకు లక్ష రూపాయల పైన కూడా సంపాదించే అవకాశం లభిస్తుంది.
మీరు కూడా మెహందీ ఆర్టిస్ట్ గా మారాలి అనుకుంటున్నారా? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ జంట నగరాల్లోని మహిళలకు మెహందీ కోర్సులను నిర్వహిస్తోంది. ఎలాంటి విద్యార్హత లేకుండానే మీరు ఈ కోర్సు జాయిన్ కావచ్చు. ఫీజు కూడా కేవలం 1500 రూపాయలు మాత్రమే. అంతేకాదు ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు ప్రొఫెషనల్ మెహందీ డిజైన్ ఆర్టిస్టుగా మారవచ్చు. ఇప్పుడు మీరు సొంతంగా ఆర్డర్లు పొందవచ్చు లేదంటే పలు ఈవెంట్ మేనేజర్ల ద్వారా మీరు వర్క్ పొందవచ్చు
బ్యూటీ పార్లర్ ద్వారా మెహందీ ఆఫర్లను పొందవచ్చు.సోషల్ మీడియాను ఉపయోగించుకొని కూడా మీరు ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు సొంతంగా మెహందీ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఔత్సాహకులకు శిక్షణ అందించవచ్చు.
పార్టీ ఆర్డర్ల కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటే మీకు పెళ్లిళ్ల సీజన్ సహా ఇతర సీజన్లో కూడా బుకింగ్స్ పెద్ద ఎత్తున లభిస్తాయి.