Business Ideas: ఈ కోర్సు నేర్చుకుంటే డబ్బుల వర్షం.. నెలకు రూ. 1 లక్ష సంపాదించొచ్చు.

Sun, 15 Sep 2024-8:17 pm,

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్ విన్ సంస్థ జంట నగరాల్లోని యువతీ యువకులకు ఉపాధి శిక్షణ కోర్సులను అందిస్తోంది. ఈ సంస్థ అతి తక్కువ ధరలకే ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న అనేక ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.  ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ఒక శిక్షణ కోర్సు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోర్సు కేవలం 1500 రూపాయలకే మూడు నెలల పాటు శిక్షణతో ఈ సంస్థలో నేర్చుకోవచ్చు.

సెట్విన్ సంస్థ అందిస్తున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ చేయడం ద్వారా మీరు ఏసి రిఫ్రిజిరేటర్ రిపేర్ వర్క్స్ నేర్చుకోవచ్చు బయట ఈ కోర్సులు నేర్చుకోవాలంటే మీరు వేలకొద్దీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సెటిల్ సంస్థలు అతి తక్కువ ధరకే నిపుణులైన శిక్షకుల చేత ఈ కోర్సును నేర్చుకోవచ్చు. అంతేకాదు ఈ కోర్సు పూర్తయిన అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు పలు కంపెనీల్లో జాబు కూడా పొందవచ్చు. లేదా మీరు సొంత కాళ్లపైనే ఏసీ టెక్నీషియన్ వర్క్స్ చేపట్టి ప్రతినెల మంచి సంపాదన పొందే అవకాశం లభిస్తుంది.  

ఏసీ టెక్నీషియన్ పనులకు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే అటు ఇండస్ట్రీస్ పరంగాను ఇళ్ళల్లో కూడా ఏసీ వాడకం అనేది పెరిగింది. ముఖ్యంగా గోడౌన్లలో హోటల్స్ లోనూ ఆఫీసుల్లోనూ ఏసీ లేకుండా పనులు జరగడం అనేది దాదాపు అసాధ్యంగా మారింది. ముఖ్యంగా పట్టణాల్లో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లకు ఏసీ అనేది తప్పనిసరి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో కూడా ఏసీ అనేది తప్పనిసరిగా మారిపోయింది.  

 అయితే ఏసీ అనేది మెయింటెనెన్స్ చేయకుండా పనిచేయదు తరచూ ఏసీ మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలి. లేకపోతే ఏసీ పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే మీరు ఉపాధి అవకాశంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో ఏసీ టెక్నీషియన్ పనులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇళ్ళల్లో ఏసీ మెయింటైన్ చేసేవారు కచ్చితంగా సర్విస్ చేయించుకుంటారు.   

ఈ సీజన్లో టెక్నీషియన్లు నెలకు లక్ష రూపాయల పైనే సంపాదిస్తారు. అంతేకాదు సంవత్సరం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏసీలకు అదే విధంగా సినిమా థియేటర్లు ఫంక్షన్ హాల్ లో ఆఫీసుల్లో కూడా ఏసీ రిపేర్ వర్క్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఇలా మీరు స్వయం ఉపాధి పొందడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link