Business Ideas: జస్ట్ 50,000 ఉంటే చాలు.. ఈ బిజినెస్ ఐడియాలతో నెలకు లక్షల్లో ఆదాయం పక్కా
Business Ideas: మనలో చాలా మంది బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన అవగాహన లేక బిజినెస్ చేసేందుకు ముందుకు రారు. అంతేకాదు బిజినెస్ చేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలనే ఒక అపోహ ఉంటుంది. దీంతో బిజినెస్ అంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ కేవలం 50వేల రూపాయలు ఉంటే చాలు. ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా నెలకు లక్షల రూపాయలు సంపాదించే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. పెట్టుబడి తక్కువ..ఆదాయం ఎక్కువ. అలాంటి టాప్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెడికల్ షాప్ : కాలంతో సంబంధం లేకుండా నడిచే వ్యాపారాల్లో మెడికల్ షాప్ ఒకటి. ప్రతిఊరిలోనూ మెడికల్ షాప్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నిత్యం ఏదొక సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడే వారికి ముందుగా గుర్తుకు వచ్చేది మెడికల్ షాపు. మీరు కూడా మెడికల్ ఏర్పాటు చేసినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. వైద్యులు అందుబాటులో లేని గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ తోపాటు మెడికల్ షాపును ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు సేవ చేయడంతోపాటు డబ్బును కూడా సంపాదించవచ్చు.
ఇంటర్నెట్ కేప్ లు: దేశంలో ఇప్పుడు డిజిటల్ విప్లవంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కేప్ లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ పథకాలు అన్నీ ఆన్ లైనలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలకు కూడా ఇంటర్నెట్ సేవలు అవసరం అవుతున్నాయి. మీ గ్రామంలో ఇంటర్నెట్ కేప్ ఏర్పాటు చేసుకుంటే మంచి వ్యాపారంగా ఉంటుంది.
ఆయిల్ మిల్స్ : ఆయిల్ మిల్స్ అనేది మంచి బిజినెస్ ఐడియా. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మంచి ఐడియా అని చెప్పవచ్చు. సోయా బీన్స్, వేరుశనగ, ఆవాల గింజల నుంచి నూనెను తీసే ఆయిల్ మిల్స్ కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. వీటి ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం ఉంటుంది.
అరటి చిప్స్ మార్కెట్లో అరటి చిప్స్ కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఇంట్లోనే అరటి చిప్స్ తయారు చేసుకుని మార్కెట్లో విక్రయించవచ్చు. మంచి క్వాలిటీ తో కూడిన చిప్స్ ను తయారు చేసి అమ్ముకుంటే మంచి లాభాలను పొందవచ్చు.
పాల వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో పాల ప్యాకెట్లు అందుబాటులో ఉంటున్నాయి. చాలా మంది సహజ సిద్ధంగా లభించే పాలు ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం ఇంటి ఇంటికి పాలు సరఫరా చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు.