Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతం
Business Ideas: బిజినెస్ చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదు. కాస్తంత తెలివితేటలు ఉంటే చాలు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత బోలెడన్నీ బిజినెస్ లు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే వ్యాపారం గురించి తెలిస్తే లక్షల్లో కాదు కోట్లలో సంపాదిస్తారు. ఎకరం భూమి ఉంటే చాలు...ఈ మొక్కలు నాటి కోటీశ్వరులు కావచ్చు.
ఎర్రచందనం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కలపకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ చూస్తే ఈ ఎర్ర చందనం గురించి పూర్తిగా తెలిసిపోతుంది. అయితే ఎర్ర చందనం మొక్కలను మనం కూడా సాగుచేయవచ్చు. ఎలాగో చూద్దాం.
ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఎర్రచందనం చెట్లు ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఎక్కువ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచడం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
ఈ ఎర్రచందనం బంగారం కంటే విలువైంది. అయితే ఈ మొక్కలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సరీల్లో విక్రయిస్తుంటారు. కేరళ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుని వాటిని మూడు నుంచి నాలుగు నెలల వరకు సంరక్షించి ప్రత్యేకమైన ఎరువులు వాడి పెద్దగా చేస్తున్నారు. అలా చేసిన తర్వాత మార్కెట్లోకి విక్రయిస్తున్నారు.
ఈ మొక్కలను ఇప్పుడు రైతులు కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు నర్సరీ యజమానులు. కానీ వాళ్ల పంటలకు ఇంత క్వాలిటీ ఉండదు. వాటిని పెంచాలంటే ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీరు కూడా ఈ మొక్కలను సాగు చేయాలి. మొక్కలను సాగు చేసే ముందు పాస్ బుక్, సర్వే నెంబర్ తోపాటు ఎంఆర్ఓ కార్యాలయంలో, ఫారెస్టు డిపార్ట్ మెంట్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని సర్వే నెంబర్లు అన్ని చూసుకుని కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఫారెస్టు అధికారులు పర్మిషన్ ఇస్తారు.
అయితే ఈ పంట చేతికి రావాలంటే దాదాపు 15ఏండ్ల వరకు వేచి ఉండాలి. అయితే 15ఏండ్లు పొలంలోనే ఉంటే కష్టం. కాబట్టి రైతులు పంట పొలాల చుట్టూ కూడా ఎర్రచందనం మొక్కలను నాటి 15ఏళ్ల తర్వాత విక్రయించవచ్చు. ఇలా ఇతర పునాస పంటలతోపాటు చందనం మొక్కలు కూడా పెరుగుతుంటాయి.
అయితే ఎర్రచందనం టన్నుకు 4 నుంచి 5 లక్షల వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఒక్కో మొక్క సైజును బట్టి 150 నుంచి 200 వరకు విక్రయిస్తుంటారు. ఎకరం భూమిలో కంచె మాదిరి మొక్కలు నాటాలంటే 4వందల మొక్కలు కావాలి. ఒక చెట్టు అర టన్ను వరకు బరువు ఉంటుంది. ఇలా పొలం చుట్టూ 40 మొక్కలు నాటితే..రూ.కోటి రూపాయల వస్తాయి. 400 మొక్కలు నాటితే రూ. 10కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.