Business Ideas For Women: ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే బెస్ట్ బిజినెస్ ఐడియా మీ కోసం
Saree Rolling Business Ideas: బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే ఈ బిజినెస్ ట్రై చేద్దాం. శారీ రోలింగ్ గురించి అందరూ వినే ఉంటారు. పాత చీరలను సైతం రోలింగ్ చేయడం ద్వారా కొత్త చీరల్లా మారిపోతూ ఉంటాయి. ఈసారి రోలింగ్ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
సాధారణంగా మార్కెట్లో ఒక చీరకు రోలింగ్ చేయాలంటే కనీసం 100 రూపాయలు వసూలు చేస్తారు. ఈ విధంగా చూస్తే రోజుకు కనీసం 10 నుంచి 20 చీరలు రోలింగ్ చేసినా మీకు 1000 నుంచి 2000 వరకూ ఆదాయం లభిస్తుంది.
అయితే ఈ రోలింగ్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది పాత పద్ధతిలో చీరలను ఒక పెద్ద చెక్క దుంగలకు కట్టి, వాటిపైన గంజి లాంటి పదార్థం స్ప్రే చేస్తారు. ఇలా చేయడం వల్ల చీరలకు ముడతలు పోయి స్టిఫ్ గా మారుతాయి.
అయితే ఈ పద్ధతిలో మీకు రోజుకు చాలా తక్కువ శారీలు మాత్రమే రోల్ చేసే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు మీ వద్ద 10 నుంచి 20 చెక్క దుంగలు ఉంటే, అన్ని చీరలు మాత్రమే మీరు రోలింగ్ చేయగలరు.
అయితే ప్రస్తుతం మార్కెట్లో సారీ రోలింగ్ మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మిషన్ ద్వారా మీరు రోజుకు దాని సామర్ధ్యాన్ని బట్టి రెండు వందల చీరల వరకు రోలింగ్ చేయవచ్చు. ఈ మిషన్ ధర 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల వరకు ఉంది. శారీ రోలింగ్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు.
మీరు ఇంటి వద్ద మామూలుగా చిన్న పద్ధతిలో బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే చెక్క దుంగల ద్వారా రోలింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు కావాల్సినంత ఆదాయం లభిస్తుంది. అదే మీరు పెట్టుబడి పెట్టి మిషన్ కొనుగోలు చేసినట్లయితే రోజుకు కనీసం 200 చీరల వరకు రోలింగ్ చేయవచ్చు. తద్వారా మీకు రోజుకు కనీసం పదివేల నుంచి 20 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఖర్చులు పోను కనీసం నీకు రోజుకు 10000 మిగులుతాయి. ఈ లెక్కన చూస్తే మీకు నెలకు మూడు లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.