Business Ideas: రియల్ ఎస్టేట్ వ్యాపారం..ఇలా చేస్తే కోట్లు సంపాదించడం ఖాయం
Real Estate Business: గత రెండు మూడేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ బూమ్ కొనసాగుతోంది. మిగతా నగరాలతో హైదరాబాద్ నగరం కూడా పోటీ పడుతోంది. ప్రస్తుతం ఈ రంగంలో పెట్టుబడులు భారీగా కొనసాగుతున్న వేళ రియల్ ఎస్టేట్ ను ఒక స్పష్టమైన ఆస్తి అని చెప్పవచ్చు. ఇది పెట్టుబడుల పోర్టు పోలియోలకు డైవర్సిటీని తీసుకువస్తుంది. ఇది కల్చర్ లో కూడా పాతుకుపోతుంది.
స్టెబిలిటీ, వ్యాల్యూ పెరిగే అవకాశం, రెంటల్ ఇన్ కమ్, ట్యాక్స్ బెనిఫిల్స్, లిమిటెడ్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ , ప్రాపర్టీపై ఎమోషనల్ అటాచ్ మెంట్ వంటి వాటితో ఈ రంగానికి చాలా పాపులారిటీ పెరిగింది. అయితే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసే ముందు మార్కెట్లో ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యంగా. మార్కెట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఇందులో ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలి. ఎలాంటి విషయాలపై అవగాహన ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్థానిక రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ ట్రెండ్, అప్ కమింగ్ డెవలప్ మెంట్స్ పై అధ్యయనంచేయాలి. సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్ మార్కెట్ ను ప్రభావితం చేసే ప్రభుత్వ కార్యక్రమాల గురించి అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాలికంగా ఉంటాయి. అవసరం అయితే ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకోండి. పెట్టుబడి హోరిజోన్ ఆధారంగా ఎగ్జిట్ వ్యూహాన్ని ప్లాన్ చేయాలి.
నైపుణ్యం, మార్కెట్ పరిజ్నానాన్ని అందించే ఏజెంట్లు, లాయర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వంటి రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి గైడెన్స్ తీసుకోవాలి.
ప్రాపర్టీ ట్యాక్సెస్ , క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సహా ట్యాక్స్ ఇంప్లికేషన్ ఈ రంగంలో ఉంటాయి. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ను అంచనా వేయాడానికి నిపుణుల సలహా తీసుకోండి.
డెవలపర్ ట్రాక్ రికార్డ్, రెప్యుటేషన్ గురించి తెలుసుకోవాలి. క్యాలిటీ ప్రాజెక్టులను సమయానికి డెలివరీ చేయడంలో పేరుగాంచిన ప్రసిద్ధ డెవలపర్స్ కోసం వెతకండి. వారి ఫైనాన్షియల్ రికార్డును స్థానిక అధికారులను అడిగి వివరాలన్నింటిని చెక్ చేసుకోవాలి.
పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా, వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా, మంచి మౌలిక సదుపాయాలతో బాడా డెవలప్ అయిన ప్రాంతాల్లో ప్రాపర్టీని సెలక్ట్ చేసుకోండి. భవిష్యత్తులో డెవలప్ , డిమాండ్ కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పెట్టుబడులపై మీ బడ్జెట్ ను ముందుగానే నిర్ణయించుకోండి. ఫైనాన్సింగ్ ఆప్షన్స్ గురించి సెర్చ్ చేయండి. కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ట్యాక్సులు, అదనపు ఛార్జీలు సహా మొత్తం ఖర్చును ఓసారి విశ్లేషించండి. అవసరం అయితే ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తీసుకోగలరేమో అంచనా వేయండి.
రెంటల్ ఇన్కమ్, వ్యాల్యూను పెంచే ప్రాపర్టీ పొటెన్షియల్ అంచనా వేయాలి. రాబడి అంచనా వేసేందుకు ప్రాంతంలో అద్దె డిమాండ్, మార్కెట్ ట్రెండ్స్ ను సెర్చ్ చేయండి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్స్ రిస్క్ లతో కూడుకున్నది కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు డీటైల్ రీసెర్చ్, విశ్లేషణ చాలా ముఖ్యం.
ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకుండా సొంతంగా పరిశోధన చాలా అవసరం. ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది..చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే వివరాల గురించి తెలుసుకోవాలి.