Business Ideas: మీ ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉందా.. అయితే ఈ పురుగులు పెంచితే చాలు.. నెలకు లక్షల్లో ఆదాయం పక్కా

Tue, 08 Oct 2024-8:44 pm,

Cultivation of silkworms: ప్రతి నెలా ఆదాయం అందించే  పట్టు పురుగుల పెంపకంపై ఇటీవల రైతులు దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలకు.. పట్టు పరిశ్రమ వరంగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం శ్రమ చేసే చిన్న, సన్నకారు రైతులకు పట్టు పురుగుల పరిశ్రమ అనుకూలంగా వుంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు వీటిపెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పట్టుపురుగుల పరిశ్రమగా విరాజిల్లుతోంది  పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి, పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తోంది.  మల్బరీ తోటల పెంపకం నుంచి షెడ్డు నిర్మాణం వరకు, పట్టు పురుగుల పెంపకం దశనుంచి మార్కెటింగ్ వరకు ఈ రాయితీలు అడుగడుగునా రైతుకు లభిస్తున్నాయి. 

సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. సాధారణంగా పట్టు పురుగు కాయగా మారడానికి 18 రోజులు పడుతుంది. ఆ తర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 దశలు ఉంటాయి. వీటినే మోల్టింగ్ దశ అంటారు.

 అయితే గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చే దశలో మొదటి 7 రోజుల్లో ఉండే చివరి రెండు దశలు అతి కీలకమైనవి. దీన్ని చాకీ దశ అంటారు.

పట్టు పురుగు పట్టు కాయగా మారడానికి 18 నుంచి 20 రోజుల సమయం పడుతుంది.  పట్టు కాయలను పెంచడం ద్వారా నెలకు రూ. 70 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.   

వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అందుకు అనుగుణంగా మార్కెట్లో ధర రాని పరిస్థితుల్లో…రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహకాలు ఇస్తుండటంతో.. రైతులు మంచి లాభాలు పొందుతున్నారు.  

ఇతర పంటలతో పోలిస్తే పట్టు పురుగల పెంపకం తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తోంది. ఒక విడతకు రూ.3 నుండి 4 లక్షల వరకు నికర ఆదాయం చేకూరుతోంది. రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే  స్వయం ఉపాధికి డోకా ఉండదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link