Business Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదే

Wed, 06 Nov 2024-6:38 pm,

New Business Ideas: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తినే ఆహారాన్ని వేస్ట్ చేయడంతోపాటు పెద్ద మొత్తం వ్యర్థాలు కూడా పేరుకుపోతుండటం అతిపెద్ద సమస్యగా మారింది. టన్నుల కొద్దీ ఆహారం డ్రైనేజీ చెత్త కుప్పలపావుతోంది. అయితే ఈ వ్యర్థాలతో బిజినెస్ చేసి పర్యావరణానికి హానికలగనివ్వకుండా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. వ్యర్థాలను తగ్గించుకునేందుకు కూడా ఈ బిజినెస్ మంచి మార్గం అని చెప్పవచ్చు. ఈ ప్రత్యేకమైన వ్యాపారంతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం గ్యారెంటీ. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అయితే ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

వర్మీ కంపోస్టింగ్ అనేది సహాజ వ్యర్థాలు వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టుగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగిస్తారు. వర్మీ కంపోస్టు మొక్కలను సారవంతం చేసేందుకు, నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.   

వర్మీ కంపోస్టు అనేది సేంద్రీయ పదార్థాలను, ఆహారా వ్యర్థాలను విచ్చిన్నం చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వర్మికస్ట్ అని పిలిచే నూట్రియంట్ రిచ్ కంపోస్టు తయారు అవుతుంది. సాధారణంగా వర్మీ కంపోస్టింగ్ లో రెడ్ విగ్లర్లు లేదా యూరోపియన్ నైట్ క్రార్లు వంటి పురుగులను ఉపయోగిస్తుంటారు. ఈ పురుగులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, కాఫీ గింజలతో సహా అనేక రకాల సేంద్రియ పదార్థాలను డైజెస్ట్ చేసుకుంటాయి.   

వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియా అనేది డబ్బా లేదా పురుగుల పొలంలో చేయవచ్చు. వర్మీ కంపోస్ట్ తయారు చేసేందుకు ఆహార వ్యర్థాలను డబ్బా బిన్ లో పోసి పురుగులను ప్రవేశపెడతారు.పురుగులు సహజ వ్యర్థాలను తింటాయి. అవి వార్మ్ టీ అనే పోషకాల ద్రవాన్ని విసర్జిస్తాయి. దీన్ని మొక్కలకు ఆహారంగా ఉపయోగించవచ్చు.  వర్మికాస్ట్ ను నేలను సారవంతంగా మార్చడానికి వినియోగించవచ్చు.   

భారత్ లో ఆహార వ్యర్థాలు ఏడాదికి 60 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. ఈ ఆహార వ్యర్థాలను వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంలో ఆహార వ్యర్థాలు అందుబాటులో ఉండటం, సేంద్రీయ ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వర్మీ కంపోస్టు బిజినెస్ కు భారత్ లో మంచి మార్కెట్ ఉంటుంది. అయితే ఆహార వ్యర్థాలను స్థిరంగా సరఫరా చేసే స్థలాన్ని ముందుగా తెలుసుకోవాలి. 

వర్మీ కంపోస్టింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల మధ్య ఇనిషియల్ ఇన్వెస్ట్ మెంట్ అవసరం అవుతుంది. ఇందులో వర్మీ కంపోస్టింగ్ సిస్టమ్, పురుగులు, ఇతర సామాగ్రి ఖర్చు అవుతుంది. అంతేకాదు వర్మీ కంపోస్టింగ్ డబ్బాలో పురుగులకు సౌకర్యవంతంగా, అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు బెడ్డింగ్ మెటీరియల్ ఖర్చులను కూడా ఇందులోనే కవర్ చేసుకోవచ్చు. 

అయితే ఈ వర్మీ కంపోస్టింగ్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం రెండు మార్గాల్లో ఉంటుంది. మొదటి మార్గంలో పురుగుల పెంపకం ద్వారా లాభం పొందవచ్చు. పురుగులను మీరే మార్కెటింగ్ చేసుకుని భారీ స్థాయిలో విక్రయించినట్లయితే  ఏటా రూ. 80లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇక రెండవది  వర్మీ కంపోస్టు ఉత్పత్తి నుంచి మంచి లాభం వస్తుంది. ఇది వర్మికంపోస్ట్ అమ్మకం ద్వారా వచ్చే లాభము. ఎక్కువగా  వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి ద్వారా వార్షిక లాభం రూ. 4లక్షల వరకు ఉంటుంది. చిన్న స్కేల్ వ్యాపారం చేయాలనుకుంటే ఈ లాభాలు రూ. 4లక్షల నుంచి 8 లక్షల లోపు ఉంటాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link