Canara Bank Recruitment 2020: భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేయాలంటే..మరో నాలుగు రోజులే గడువు

Fri, 11 Dec 2020-10:32 am,

ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇదొక శుభవార్త. కెనరా బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్,బ్యాంకు  బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ వంటి పోస్టులున్నాయి. మొత్తం 220 ఖాళీల కోసం నోటిఫికేషన్ ఇది..

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 25నే ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో ముగుస్తోంది. అంటే డిసెంబర్ 15 చివరి తేదీ. త్వరపడండి. 2021 జనవరి , ఫిబ్రవరి నెలల్లో రిక్రూట్ మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా ఎంపిక జరుగుతుంది. 

కెనరా బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు https://canarabank.com/ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్హతల్ని పూర్తిగా గమనించి దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక్కో విభాగానికి ఒక్కో విద్యార్హత ఉంది. 

కెనరా బ్యాంకు ప్రకటించిన 220 ఖాళీల్లో..బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ -4, ఎక్స్‌ట్రాక్ట్, ట్రాన్స్‌ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్ - 5, బీఐ స్పెషలిస్ట్ - 5, యాంటీ వైరస్ అడ్మినిస్ట్రేటర్ - 5, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 10, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ -12, డెవలపర్/ప్రోగ్రామర్ -25, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-21, ఎస్ఓసీ అనలిస్ట్ -4, మేనేజర్ లా-43, కాస్ట్ అకౌంటెంట్ -1, ఛార్టర్డ్ అక్కౌంటెంట్-20, మేనేజర్ ఫైనాన్స్-21, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ -4, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్-2, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్-2, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్-2, OFSAA అడ్మినిస్ట్రేటర్-4 , సీనియర్ మేనేజర్-1, మేనేజర్-13 పోస్టులున్నాయి. 

ఇక విద్యార్హతలు మాత్రం వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో చూసి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. హిందీ భాష తెలిసుండాలి. దరఖాస్తు ఫీజు 6 వందల రూపాయలు. ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం కేవలం 100 రూపాయలే ఫీజు. 

కెనరా బ్యాంకు పోస్టులకు దరఖాస్తు చేయాలంటే...ముందుగా https://canarabank.com/  వెబ్‌సైట్ ఓపెన్ చేసి..Careers పై క్లిక్ చేయాలి. తరువాత Recruitment పై క్లిక్ చేస్తే..స్క్రీన్‌పై మీకు..Recruitment projects-2/2020, specialist officers and special recruitment drive under st category నోటిఫికేషన్ కన్పిస్తుంది. 

దరఖాస్తు చేసిన తరువాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాల్ని నమోదు చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరి చూసుకుని దరఖాస్తు సబ్మిట్ చేయాలి. దరఖాస్తును ప్రింట్ తీసుకుని భద్రపర్చుకుంటే మంచిది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link