Cancer Risk: రోజూ ఈ 5 టిప్స్ పాటిస్తే కేన్సర్ ముప్పు 50 శాతం తగ్గడం ఖాయం

Sun, 03 Nov 2024-7:46 pm,

స్ట్రెచింగ్

స్ట్రెచింగ్ కండరాలను బలోపేతం చేస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కేన్సర్ ముప్పును తగ్గిస్తుంది. రోజూ కాస్సేపు స్ట్రెచింగ్ చేస్తుండాలి. 

యోగా

యోగా అనేది శరీరానికి , మనస్సుకు రెండింటికీ ప్రయోజనకరం. రోజూ నిర్ణీత మోతాదులో యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది. కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

వెయిట్ లిఫ్టింగ్

వెయిట్ లిఫ్టింగ్ కేవలం కండరాలను బలోపేతం చేయడమే కాకుండా శరీరంలో హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో దోహదమౌతుంది. వారంలో 2-3 సార్లు వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కేన్సర్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది.

సైక్లింగ్

సైకిల్ నడపడం అనేది బెస్ట్ కార్డియో వాస్క్యులర్ వ్యాయామం. కాలి కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరం సామర్ద్యం పెరుగుతుంది. సైకిల్ నడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల కేన్సర్ ముప్పు 45 శాతం తగ్గుతుంది.

ఏరోబిక్స్

ఏరోబిక్స్ వ్యాయామం లేదా వేగంగా నడవడం, పరుగెట్టడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచవచ్చు. మెటబోలిజం వేగవంతమౌతుంది. బరువు నియంత్రణకు దోహదపడుతుంది. దాంతోపాటు శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. కేన్సర్ వృద్ధిని తగ్గిస్తుంది. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం అవసరం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link