CBSE Board Exam 2021 schedule news: సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర మంత్రి క్లారిటీ
లైవ్ వెబ్‌నార్ ( Union Minister Ramesh Pokhriyal Nishank live webinar ) సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలను రద్దు చేయడం, పరీక్ష లేకుండానే విద్యార్థులను పాస్ చేయడం లాంటి పరిణామాల వల్ల విద్యార్థులపై స్టాంప్ వేసినట్టే అవుతుందని.. భవిష్యత్తులో ఉన్నత విద్యలో అడ్మిషన్లు పొందడంలో, ఉద్యోగాలు లభించడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.
సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేసే ఉద్దేశం లేదని.. ఆలస్యంగానైనా సరే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు జనవరి-ఫిబ్రవరిలో జరగవని, అయితే పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనేది ఫిబ్రవరి తరువాతే నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.
రాబోయే 2021 బోర్డు పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, అనేక సిబిఎస్‌ఇ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని, అందువల్ల ఆన్‌లైన్ పరీక్షలు ( CBSE Exams 2021 ) సాధ్యం కాదని పోఖ్రియాల్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ పరీక్షల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకపోవడానికి కారణం అదేనని రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
COVID-19 కారణంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులుగా వారిపై ఎలాంటి చెడు ముద్ర పడకుండా చూడాలనేదే కేంద్రం తాపత్రయం అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ( CBSE practical exams 2021 ) ఉండవని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ధృవీకరించారు. 2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని.. మార్చిలో తేదీల విషయానికొస్తే, పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందుకే ఫిబ్రవరి తర్వాతే పరీక్షల తేదీలు వెల్లడిస్తామని అన్నారు.
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌ను తగ్గించడం గురించి కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ సిబిఎస్‌ఇ ఇప్పటికే సిలబస్‌ను 30 శాతానికి ( CBSE Exams syllabus 2021 ) తగ్గించిందని, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 2020-21 విద్యా సంవత్సరానికి తమ సిలబస్‌ను తగ్గించాయని చెప్పారు. ( Image credits: PTI )
"తగ్గిన సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది " అని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్పష్టంచేశారు.