Deepika - Ranveer Singh: దీపికా పడుకునే, రణ్వీర్ సింగ్ లకు పుట్టబోయేది ఎవరో తెలుసా?

Sat, 06 Jul 2024-8:16 pm,

బాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సెలబ్రిటీ జంటలలో.. రన్వీర్ సింగ్, దీపిక పడుకొని కూడా ముందే ఉంటారు. దీప్ వీర్ అని అభిమానులు వీరిని.. ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. చాలాకాలం డేటింగ్ చేసిన ఈ జంట 2018 అక్టోబర్లో పెళ్లితో ఒకటైంది.

దీపికా పడుకొనే ఈ మధ్యనే కల్కి 2898 ఏడి.. సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. 2023 లో రన్వీర్ సింగ్ నటించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ కహాని.. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి సింగం ఎగైన్ అనే సినిమాలో నటిస్తున్నారు. 

రన్వీర్ సింగ్, దీపిక పడుకునే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో తమ.. బిడ్డ పుట్టబోతున్నట్లుగా ఈ ఏడాది మొదట్లో ఈ జంట అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా విషయం గురించి చాలా సంతోషంగా ఉన్నారు.   

పండిత్ జగన్నాథ గురూజీ ఒక పాపులర్ సెలబ్రిటీ.. జ్యోతిష్యుడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వ్యక్తిగత, సినిమా జీవితాల గురించి జ్యోతిష్యాలు చెప్పిన ఆయన దీపికా పడుకొనే, రన్వీర్ సింగ్ ల పుట్టబోయే బిడ్డ గురించి.. కూడా జ్యోతిష్యం చెప్పారు.

రణ్వీర్ సింగ్, దీపికా పడుకొనెలకు పుట్టబోయేది మగ బిడ్డ అని ఆయన చెబుతున్నారు. ఇక ఆ బిడ్డ కారణంగా.. రణ్వీర్ సింగ్, దీపిక పడుకునే ఇద్దరికీ అన్ని రకాలుగా చాలా బాగా కలిసి వస్తుంది అని ఆయన చెప్పారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link