Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం అందజేస్తోంది.
ఈ స్కీమ్‌ను ఏడాది డిసెంబర్ నెలతో ముగియనుండగా.. ప్రధాని మోదీ ఐదేళ్లు పొడగించారు.
అంటే డిసెంబర్ 2028 వరకు ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు దారులు ఉచితంగా రేషన్ పొందొచ్చు.
ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది.