Central Bank Of India Job: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి ముందే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్.. డోంట్ మిస్ గురూ..
ఈ నోటిఫికేషన్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉద్యోగం పొందడానికి ఏదైనా డిగ్రీ అయిన పాస్ పూర్తి చేసిన పర్వలేదు.
అంతేకాకుండా ఈ బ్యాంక్ ఉద్యోగం అప్లై చేసుకోవడానికి IIBF ద్వారా ఫోరెక్స్ సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత రంగాల్లో కూడా రెండు సంవత్సరాల పని చేసి ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఈ ఉద్యోగంలో భాగంగా ప్రొబిషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎంపికైన వారు తప్పకుండా ఆరు నెలల శిక్షణ అందించబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ నోటిఫికేష్‌లో మొత్తం 150 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ దరఖాస్తు ప్రక్రియ జనవరి 03 నుంచి ప్రారంభమవుతుంది. దీనిని జనవరి 23 తేది లోపు ఆన్లైన్‌లో అప్లై చేసే వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణిస్తారు. దీనికి కనీస వయస్సు 23 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునేవారు షార్ట్ లిస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ఉంటుంది. అయితే దీనిని అప్లై చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సెలక్ట్ అయిన వారికి హైదరాబాద్‌తో పాటు కోల్ కత్తాలో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు కూడా నోటిఫికేషన్‌తో తెలిపారు.