Dearness Allowance Calculation: మూడేళ్లుగా రాష్ట్రంలో డీఏ నిలిపివేత.. ప్రతి ఉద్యోగికి ఎంత నష్టమంటే..?
కేంద్రం ఉద్యోగులకు ఈ దీపావళి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ ని పెంచుతూ.. శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డీఏని కూడా.. కలిపి ఇస్తామని ఉద్యోగులకు ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు.. కేంద్ర ప్రభుత్వం డీఏ ని పెంచి ఊరట కలిగించింది. అయితే రాష్ట్రాల వారీగా పనిచేసే ఉద్యోగులకు డీఏ పెంచకపోగా.. గత మూడేళ్లుగా ఒక్కొక్క ఉద్యోగి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది.
మరి ముఖ్యంగా బేసిక్ వైజ్.. ఒక్కొక్క ఉద్యోగి మూడేళ్లుగా నిలిపివేయబడ్డ డిఏ కారణంగా ఎంత నష్టపోయారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వంలో రూ.19,000 అనుకుంటే 2022లో 22.7% డి ఏ కింద రూ.4323 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే జనవరి 2024 లో 37.31 శాతం వరకూ డీఏ పెంచగా.. మొత్తం మూడేళ్లుగా రూ.41, 484 నష్టపోయారు. రూ.19, 640 బేసిక్ అయితే రూ.42,900 మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగి నష్టపోయారు. బేసిక్ రూ.20,280 అయితే మూడేళ్ల కాలంలో రూ.44, 280 ఉద్యోగి నష్టపోయారు. అలా రూ.20,920 బేసిక్ శాలరీ అయితే రూ.45,696 రూపాయలు నష్టపోయారు.
రూ.21,580 బేసిక్ శాలరీకి రూ.47,136, రూ.22,240 బేసిక్ శాలరీకి రూ.48, 564, రూ.22,900 బేసిక్ శాలరీకి రూ.50,004, రూ.23,590 బేసిక్ శాలరీకి రూ.51,510 , రూ.24,280 బేసిక్ శాలరీకి రూ .53, 016, రూ.24,970 బేసిక్ శాలరీ, రూ.54,522, రూ .26,410 బేసిక్ శాలరీకి రూ.57,690, రూ.31,040 బేసిక్ శాలరీ కి రూ .67,776, రూ.40,000 బేసిక్ శాలరీకి రూ.87,360, రూ.51,320 బేసిక్ శాలరీకి 1,12,80 రూపాయల మేరా ప్రభుత్వ ఉద్యోగి మూడేళ్లలో నష్టపోయారు
రూ.58,850 బేసిక్ శాలరీకి రూ.1,28, 544, రూ.92050 బేసిక్ శాలరీకి రూ .2,01,048, రూ.1,01,870 బేసిక్ శాలరీకి రూ.2,22,498 , రూ.1,58,380 బేసిక్ శాలరీకి రూ.3,45,918, రూ.1,62, 070 బేసిక్ శాలరీకి రూ .3,53,958 నష్టపోయినట్లు సమాచారం.
గత మూడేళ్లలోనే ఒక్కొక్క ఉద్యోగి ఇంత నష్టం చవిచూస్తున్నారు అంటే ఇదంతా ప్రభుత్వానికి లాభం అనే చెప్పాలి. మరి సమయానికి జీతాలు రావట్లేదు అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాపోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇవన్నీ కనుక రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఉద్యోగులకు అందించినట్లయితే రాష్ట్ర ఖజానాకు కూడా కాస్త చిల్లు పడుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి