7Th Pay Commission New Update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు DAతో పాటు ఊహించని స్థాయిలో జీతాలు పెంపు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారీ జీతాలలో పెరుగుదలను పొందనున్నారని సమాచారం. DA (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు ద్వారా కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న డీఏ పెంపుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. దీపావళి పండుగ ఈ నెల చివరలో వచ్చే నేపథ్యంలో పండుగకు ముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
DA 3 శాతం పెరగనుంది అంటే, ఉద్యోగుల జీతాలలో మరింత పెరుగుదల ఉండబోతుంది. పండుగ సమయంలోనే ఈ పెంపు అమలులోకి వస్తే ఉద్యోగులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
డీఏ 3% పెరిగి మొత్తం 53% అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని బట్టి ప్రస్తుతం ఉద్యోగులు తమ బేసిక్ పేపై 50% డీఏ పొందుతున్నారు. త్వరలో జరుగుతున్న ఈ పెంపు తర్వాత, అదే బేసిక్ పేపై 53% డీఏ లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా త్వరలోనే పెరగబోయే డీఏ వర్తిస్తుంది. కాబట్టి, డీఏ పెంపు వారి పెన్షన్లను కూడా పెంచుతుంది.
ద్రవ్యోల్బణం కారణంగా వస్తువులు, సేవల ధరలు పెరుగుతున్నాయి. డీఏ పెంపు ద్వారా ఉద్యోగులకు కాస్త ఉపశమనం లభించడమే కాకుండా.. వస్తువులను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు.
అదనపు ఆదాయం వల్ల ఉద్యోగుల ఆర్థిక స్థితిలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇంటి అద్దె, విద్య, వైద్యం వంటి ఖర్చులను సులభంగా భరించే అవకాశాలు ఉన్నాయి.