New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ప్రకటించింది. ఇది వరకే రెండో దశలలో కరోనా వ్యాక్సినేషన్ జరగగా, మూడో దశలో వ్యాక్సినేషన్ మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నామని కేంద్రం ప్రకటించింది.
Also Read: COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి, బీ అలర్ట్
పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లతో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్‌ను ఆపై 60 ఏళ్లు పైబడిన ప్రజలు మరియు 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ చేశారు. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారందరూ కరోనా టీకాలు తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు. ఇందుకోసం కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొవిన్ యాప్ ద్వారా టీకా తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బుధవారం నాడు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధరలు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులకు రూ.400కే వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600గా ధర నిర్ణయించింది. భారత్ బయోటెక్ మరియు డాక్టర్ రెడ్డీస్ (రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూటర్) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read: COVID-19 Dos And Donts: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకోండి
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50 శాతం టీకా డోసులను కేంద్ర డ్రగ్స్ లాబోరేటరీ(CDL)కు, భారత ప్రభుత్వానికి, మిగతా 50 శాతం వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులకు మరియు ఓపెన్ మార్కెట్‌కు తీసుకురానుంది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు వారి సొంత ధరలను ప్రకటించనున్నాయి. అయితే 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది.
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైనా సరే పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగానే కోవిడ్19 వ్యాక్సిన్ పంపిణీ కొనసాగించనున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50 శాతం టీకా డోసులను కేంద్రానికి, మిగతావి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు సరఫరా చేస్తారు.
Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు
కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ మోతాదులను కేటాయించడంతో పాటు వాటి ధరలను నిర్ణయిస్తుంది. కరోనా రెండో దశలో భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ నిల్వలు కరువైనట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook